Begin typing your search above and press return to search.

రత్తాలుకు మెగా విషెస్

By:  Tupaki Desk   |   22 Nov 2017 4:59 PM GMT
రత్తాలుకు మెగా విషెస్
X
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నెంబర్ 150లో ఛాన్స్ దక్కించుకున్న హాట్ బ్యూటీ కాజల్ కి ఏ స్థాయిలో ఆదరణ దక్కిందో అంతకంటే ఎక్కువగా జస్ట్ స్పెషల్ సాంగ్ లో కనిపించిన లక్ష్మీ రాయ్ కి కూడా మంచి ఆదరణ దక్కింది. ఆ సినిమాలో రత్తలు అంటూ చిరుతో స్టెప్పులు వేసిన ఈ బ్యూటీ చాలా లక్కీ అని చెప్పాలి. అయితే అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా కెరీర్ లో గుర్తుండి పోయే సినిమాలను అంతగా చేయలేదు.

మ్యాటర్లోకి వస్తే.. ఈసారి బాలీవుడ్ లో మొదటి అవకాశాన్ని దక్కించుకొని బారి స్థాయిలో సినిమాను రిలీజ్ చేయబోతోంది. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. సినిమాకు మొన్నటి వరకు లక్ష్మీ ప్రమోషన్స్ ని బాగానే నిర్వహించింది. అయితే అమ్మడికి పెద్ద స్టార్స్ ఎవ్వరు అంతగా విషెస్ చెప్పలేదు. కానీ ఎవరు ఊహించని విధంగా లక్ష్మి మెగాస్టార్ నుంచి మంచి విషెస్ ని అందుకొంది. ఈ సినిమా నీకు మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని రత్తలుకు మెగాస్టార్ చిరంజీవి ఆల్ ది బెస్ట్ చెప్పడంతో సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది.

మెగాస్టార్ సోషల్ మీడియా ద్వారా ఈ విషెస్ అందించడంతో రాయ్ లక్ష్మి కూడా పట్టలేని సంతోషం తో ట్వీట్ చేసింది. ఓ మై గాడ్ నిజంగా ఇది నమ్మలేకపొతున్నా అంటూ.. హార్ట్ ఫుల్ గా చెప్పిన ఈ విషెస్ ఎప్పటికి గుర్తుంటాయి సార్.. చాలా కృతజ్ఞతలు చిరంజీవి గారు..లవ్యూ సార్ అని లక్ష్మీ హ్యాపీగా ట్వీట్ చేసింది.