Begin typing your search above and press return to search.

చిరు వైఫ్ సురేఖ ఏడ్చేశారు..ఎందుకు? ఎక్కడ?

By:  Tupaki Desk   |   2 April 2017 5:23 AM GMT
చిరు వైఫ్ సురేఖ ఏడ్చేశారు..ఎందుకు? ఎక్కడ?
X
తెలుగు సినిమా..అందునా అగ్ర హీరో సినిమాలో.. హీరో గడ్డం నెరిసిపోయి ఉండటం ఊహించగలమా? వయసు ఎంత మీద పడుతున్నా.. ముఖంలో మడతలు కనిపిస్తున్నా.. కాలేజీ స్టూడెంట్ మాదిరి కనిపించేందుకు కిందా మీదా పడే తీరుకు భిన్నంగా రియలిస్టిక్ గా కనిపించేందుకు ఏ మాత్రం వెనుకాడని అతి కొద్దిమంది హీరోల్లో వెంకటేశ్ ఒకరు. తాజాగా ఆయన నటించిన ‘‘గురు’’ మూవీ విషయానికి వస్తే.. ఆయన యాక్ట్ చేసిన క్యారెక్టర్ చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. తండ్రివయసున్నక్యారెక్టర్ ను గ్లామర్ హీరోగా ముద్ర ఉన్న వెంకీ చేయటం చిన్న విషయం కాదు.

కథను నమ్మి.. ఓకే చేసిన ఈ మూవీలో వెంకీ కనిపించే తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ తరహా సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు. నెరిసిన గడ్డం.. నాన్న లాంటి వయసు అనే డైలాగ్ ను ఓకే చేయటం లాంటివి మామూలు విషయాలు కావనే చెప్పాలి. ఇలాంటి రిస్క్ ను తీసుకున్న వెంకీని ఇప్పుడు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

గురు చిత్రంలో వెంకీ పోషించిన పాత్రపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇలాంటి పాత్రను చేయటం రిస్క్ అని చెప్పటమే కాదు.. నువ్వు ఎప్పుడూ రిస్క్ ను తీసుకుంటావ్ అంటూ మనస్ఫూర్తిగా అభినందించటాన్ని ప్రస్తావించారు వెంకీ. అంతేకాదు.. తన చాయిస్ మెగాస్టార్ కి నచ్చిందని వెంకటేశ్ వెల్లడించారు. ఆయన మెగాస్టార్ గురించి ప్రస్తావిస్తే.. గురు డైరెక్టర్ సుధ అయితే.. చిరు వైఫ్ సురేఖ గురించిన ఆసక్తికర ముచ్చట చెప్పుకొచ్చారు.

చాలామంది పలువురు సినీ ప్రముఖుల గురించి మాట్లాడుతుంటారు. ఎవరూ కూడా చిరు వైఫ్ గురించి అస్సలు ప్రస్తావించరు. కానీ.. గురు దర్శకురాలు సుధ.. చిరు వైఫ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘చిరంజీవి వైఫ్ సురేఖ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. బాక్సింగ్ మూవీ కదా?ఏముంటుందిలే అని అనుకున్నారట. కానీ..సినిమా చూశాక మాత్రం.. ఇది బాక్సింగ్ మూవీ కాదు..మంచి ఎమోషనల్ మూవీ అని చెప్పారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు భావోద్వేగంతో ఏడ్చేశారు’’ అని వెల్లడించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/