Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఆఫ‌ర్ త‌న‌యుడికా? మేన‌ల్లుడికా?

By:  Tupaki Desk   |   12 April 2022 3:30 PM GMT
మెగాస్టార్ ఆఫ‌ర్ త‌న‌యుడికా? మేన‌ల్లుడికా?
X
మెగాస్టార్ చిరంజీవి ఇత‌ర భాష‌ల‌ సినిమాల్ని రౌండ‌ప్ చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా రీమేక్ ల‌కు ఒకే చెబుతూ కొత్త చిరంజీవిని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే మ‌ల‌యాళం సినిమా `లూసీఫ‌ర్` ని `గాడ్ ఫాద‌ర్` టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తిచేసారు. అలాగే ఓ క‌న్న‌డ చిత్రాన్ని `భోళాశంక‌ర్` టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. . ఈ చిత్రానికి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది.

అలాగే బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు యంగ్ మేక‌ర్ వెంకీ కుడుమ‌ల తో కూడా ఓ సినిమా చేస్తున్న‌ట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించారు. ఆ ప్రాజెక్ట్ వివ‌రాలు తెలియాల్సి ఉంది. వ‌రుస పెట్టి ప్ర‌క‌టించ‌మే కాదు..వాటిని వీలైంన‌త త్వ‌రగా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నాలు అంతే వేగంగా జ‌రుగుతున్నాయి. అలాగే మ‌ల‌యాళంలో ఇటీవ‌లే రిలీజ్ అయి సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసిన `బ్రో డాడి` రీమేక్ లోనూ న‌టించ‌డానికి చిరంజీవి రెడీగా ఉన్న‌సంగ‌తి తెలిసిందే.

ఈ చిత్రానికి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. ప్ర‌స్తుతం అత‌ని ఆధ్వ‌ర్యంలో స్ర్కిప్ట్ రీమేక్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే మేక‌ర్ గా ఇంకా అత‌ను ఫైన‌ల్ కాలేదు. రీమేక్ బాధ్య‌త‌ల వ‌ర‌కూ అత‌నికి అప్ప‌గించిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. తుదిగా స్ర్కిప్ట్ సిద్ద‌మైన త‌ర్వాత ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది మెగాస్టార్ ఫైన‌ల్ చేస్తారు. అయితే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మ‌రో ముఖ్య‌మైన పాత్ర ఉంది.

ఇందులో ఓ యంగ్ హీరో చిరంజీవి త‌న‌యుడిగా న‌టించాల్సి ఉంది. ఈనేప‌థ్యంలో ఆ పాత్ర కోసం సాయిధ‌ర‌మ్..వ‌రుణ్ తేజ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా ఎవ‌ర్నీ ఫైన‌ల్ చేయ‌లేదు. చిరంజీవి కోరిక మేర‌కు ఆ నిర్ణ‌యం జ‌రుగుతుంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నుంది.

ఇక ఏప్రిల్ 29న చిరంజీవి న‌టించిన `ఆచార్య` రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా మ‌రికొన్ని రోజుల్లో చిరంజీవి ప్ర‌మోష‌న్ ప‌నుల్లో బిజీ అవుతారు. ఆ సినిమా రిలీజ్ అనంత‌రం సెట్స్ లో ఉన్న బ్యాలెన్స్ సినిమా షూటింగ్ లు పూర్తి చేస్తారు. అటుపై `బ్రోడాడి` పూర్తి వివ‌రాలు అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.