Begin typing your search above and press return to search.

త‌న‌యుడిని చిరు అనుస‌రించ‌ని కార‌ణం?

By:  Tupaki Desk   |   3 Dec 2020 5:00 AM IST
త‌న‌యుడిని చిరు అనుస‌రించ‌ని కార‌ణం?
X
మెగాస్టార్ చిరంజీవి 2020 మార్చిలో ట్విట్ట‌ర్ లో చేర‌గా ఆయ‌న‌ను దాదాపు 822కె ఫాలోవ‌ర్స్ అనుస‌రిస్తున్నారు. అయితే చిరంజీవి మాత్రం ఒకే ఒక్క‌రిని అనుస‌రిస్తున్నారు. ఆయ‌నే అనీల్ రావిపూడి. బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌తో స‌త్తా చాటుతున్న‌ అనీల్ రావిపూడినే చిరు అనుస‌రించ‌డానికి కార‌ణ‌మేమిటి? అంటే దానికి కొణిదెల కాంపౌండ్ నుంచి ఆన్స‌ర్ ఉంది.

చిరుత‌న‌యుడు చ‌ర‌ణ్ ని కూడా అన్ ఫాలో చేసేసి రావిపూడినే యెందుకని చిరు అనుస‌రిస్తున్నారు? అంటే అదే ఇక్క‌డ స‌స్పెన్స్. త్వ‌ర‌లోనే అనీల్ రావిపూడితో ఓ సినిమా చేసేందుకు చిరు సిద్ధంగా ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపించాయి ఇదివ‌ర‌కూ. రావిపూడి మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ ఎన‌ర్జీకి త‌గ్గ ఎంట‌ర్ టైన‌ర్ క‌థ‌ను రెడీ చేసి ఒప్పించ‌గ‌లిగితే ఆఫ‌ర్ ఖాయ‌మ‌వుతుంద‌నే భావిస్తున్నారు. ప్ర‌స్తుతానికి అనీల్ రావిపూడితో క‌మ్యూనికేష‌న్ కొన‌సాగుతోంద‌నే అర్థ‌మ‌వుతోంది.

ఇక చిరుని అనుస‌రించే వాళ్ల‌లో చ‌ర‌ణ్ .. వెంక‌టేష్.. నాగార్జున వంటి ప్రముఖులు ఉన్నారు. చిరు ట్విట్టర్లో చేరినప్పటి నుండి అభిమానులకు అనుచరులకు వినోదాన్ని సృష్టించడానికి ఈ వేదికను ఉపయోగిస్తున్నారు. తన సహచరులకు చమత్కారమైన సమాధానాలు ఇవ్వడం నుండి ఆసక్తికరమైన అనుభవాలను పంచుకోవడం వరకు చిరంజీవి ట్విట్టర్ లోనూ మెరుపులు మెరిపిస్తున్నారు. చిరంజీవి ట్విట్టర్ ‌లో చేరిన కొద్ది రోజుల తరువాత రామ్ చరణ్ కూడా సోషల్ నెట్‌వర్కింగ్ వేదిక‌ల‌పై యాక్టివ్ అయిన సంగ‌తి తెలిసినదే. మొన్న మొన్న‌టివ‌ర‌కూ చిరంజీవి ట్విట్ట‌ర్ లో రామ్ చరణ్ ను అనుసరించేవారు. కానీ ఇప్పుడు అన్ ఫాలో చేశారు ఎందుక‌నో! చిరు త్వ‌ర‌లోనే కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలోని ఆచార్య చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన‌నున్న సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి మూడు నాలుగు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.