Begin typing your search above and press return to search.

క్రిస్మస్‌ మూవీ కలెక్షన్స్‌ ఆధారంగా సంక్రాంతి మూవీస్‌ ఉంటాయేమో!

By:  Tupaki Desk   |   24 Dec 2020 9:33 AM IST
క్రిస్మస్‌ మూవీ కలెక్షన్స్‌ ఆధారంగా సంక్రాంతి మూవీస్‌ ఉంటాయేమో!
X
కరోనా కారణంగా మార్చి నెలలో మూత పడ్డ థియేటర్లు ఎట్టకేలకు ఓపెన్‌ అయ్యాయి. థియేటర్లు ఓపెన్‌ అయ్యి దాదాపు నెల అవుతున్నా కూడా పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో వెల వెల బోతున్నాయి. ఎట్టకేలకు మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తన సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమాను క్రిస్మస్‌ కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లకు అనుమతులు ఇచ్చారు. దానికి తోడు కరోనా స్ట్రెయిన్‌ కూడా భయపెడుతోంది. మరి సినిమాకు కలెక్షన్స్‌ ఎలా వస్తాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చిరంజీవి సోలో బ్రతుకే సో బెటర్ సినిమా గురించి స్పందిస్తూ ఈ సినిమా సక్సెస్‌ అయితే ఇతర సినిమాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నిజంగానే ఈ సినిమాకు ఒక గౌరవ ప్రథమైన కలెక్షన్స్‌ నమోదు అయితే సంక్రాంతికి సినిమాలు డౌట్ లేకుండా సినిమాలు వస్తాయి. కాని కాస్త అటు ఇటు అయితే మాత్రం ఇప్పటికే కన్ఫర్మ్‌ అయిన సినిమాల్లో ఒకటి రెండు అయినా వెనక్కు తగ్గే అవకాశం లేకపోలేదు అంటున్నారు. తేజూ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చి కలెక్షన్స్‌ రాకుంటే ఖచ్చితంగా మరి కొన్నాళ్ల పాటు సినిమాల విడుదల వాయిదాలు వేసుకునే అవకాశం ఉందంటున్నారు. ఏం జరుగబోతుంది మరి కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.