Begin typing your search above and press return to search.
ఈ సమయంలో చిరు ఏం చేస్తున్నాడంటే..!
By: Tupaki Desk | 21 May 2020 11:30 AM ISTఅంతా బాగుంటే మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య షూటింగ్ ముగింపు దశకు వచ్చేది. కాని షూటింగ్స్ అన్ని ఆగిపోవడంతో ఆచార్య షూట్ కూడా ఆగిపోయింది. పరిస్థితులు కుదుట పడుతున్న నేపథ్యంలో మళ్లీ షూటింగ్స్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. జూన్ లేదా జులై నెలల్లో పూర్తి స్థాయిలో షూటింగ్స్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గత రెండు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన చిరంజీవి అసలు ఈ సమయంను ఏం చేస్తున్నాడు అంటూ చాలా మందికి ఆసక్తిగా మారింది. తాజాగా ఆ విషయమై చిరు స్వయంగా మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు.
ఈ సమయంలోనే చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ ను పెడుతూనే ఉన్నాడు. ఇదే సమయంలో చిరంజీవి ప్రతి రోజు కూడా ఖచ్చితంగా వర్కౌట్స్ చేస్తున్నాడట. ఉదయం కనీసం 40 నిమిషాల పాటు వర్కౌట్స్ చేయడంతో పాటు రోజులో రెండు సార్లు స్విమ్మింగ్ చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు. ఇక సమయం చిక్కినప్పుడల్లా ఖచ్చితంగా కిచెన్ లోకి వెళ్లి ఏదో ఒక వంట చేసుకుంటూ ఉంటున్నాను అన్నాడు.
తన చిన్న తనంలోనే అమ్మకు సాయం చేస్తూ వంట నేర్చుకున్నాను. నేను ఏ వంట చేసినా కూడా ఆ క్రెడిట్ అమ్మకే దక్కుతుంది. అమ్మ వల్లే నాకు వంటలపై ఆసక్తి కలగడంతో పాటు నేర్చుకున్నాను అన్నాడు. 5 ఏళ్ల వయసు నుండి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా సమయం దొరికినప్పుడు వంట చేస్తున్నాను అంటూ చిరంజీవి నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు. ఇక నా మనవళ్లు మనవరాళ్లతో కూడా ఎక్కువ సమయంను స్పెండ్ చేస్తున్నట్లుగా చిరంజీవి చెప్పుకొచ్చాడు. షూటింగ్స్ ప్రారంభం కోసం తాను ఎదురు చూస్తున్నట్లుగా పేర్కొన్నాడు.
