Begin typing your search above and press return to search.

న‌ట‌గురువుకు మెగాస్టార్ నివాళి

By:  Tupaki Desk   |   3 Aug 2019 5:14 PM IST
న‌ట‌గురువుకు మెగాస్టార్ నివాళి
X
ద‌ర్శ‌క‌న‌టుడు.. న‌ట‌గురువు దేవ‌దాస్ క‌న‌కాల (75) అనారోగ్యంతో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. నేటి (శ‌నివారం) ఉదయం కొండాపూర్ కిమ్స్ నుంచి మణికొండ మర్రిచెట్టు స‌మీపంలో ఉన్న ఆయ‌న‌ స్వ‌గృహానికి తీసుకొచ్చారు. ఉదయం 11:30 గం.ల వరకు ఇంటి వ‌ద్ద‌నే ఉంచారు. ఆ తర్వాత హైద‌రాబాద్ మ‌హాప్ర‌స్థానంలో దహన సంస్కరాలు పూర్తి చేశారు. దేవ‌దాస్ తనయుడు రాజీవ్ కనకాల అంత్యక్రియలను పూర్తి చేశారు.

ఆయన మరణవార్త తెలుసుకున్న చిరంజీవి... రాజేంద్రప్రసాద్.. శివాజీరాజా.. సమీర్.. బ్రహ్మాజీ.. హేమ సహా పలువురు సినీ ప్రముఖులు దేవదాస్ కనకాల ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు. మ‌ణికొండ ప‌రిస‌రాల్లో మ‌ర్చిచెట్టు వ‌ద్ద ఉన్న క‌న‌కాల స్వ‌గృహానికి పెద్ద ఎత్తున న‌ట‌గురువు శిష్యులు విచ్చేశారు. అలానే ప‌లువురు ప్ర‌ముఖ న‌టీన‌టులు దేవ‌దాస్ క‌న‌కాల‌ను క‌డ‌సారి చూపు చూశారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయ‌న మృతి ప‌ట్ల దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. క‌న‌కాల‌ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు.

నాటక రంగం నుండి సినిమా రంగంలోకి ప్ర‌వేశించిన దేవదాస్ కనకాల టాలీవుడ్ లో ఎంద‌రో ప్ర‌ఖ్యాత న‌టీన‌టుల‌కు శిక్ష‌ణ‌నిచ్చారు. రజనీకాంత్- చిరంజీవి- రాజేంద్రప్రసాద్- రఘువరన్- నాజర్ వంటి ఎందరో నటీనటుల‌కు ఆయ‌న న‌ట‌న‌లో మెళ‌కువ‌లు నేర్పారు. దర్శకుడినూ ఆయ‌న కొన్ని సినిమాలను తెరకెక్కించారు.