Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కు కొత్తగా ట్రైనింగ్ ఏంటో!!

By:  Tupaki Desk   |   12 April 2017 10:24 AM GMT
మెగాస్టార్ కు కొత్తగా ట్రైనింగ్ ఏంటో!!
X
ఈ మధ్యన కొన్ని కవర్ స్టోరీలు చదువుతుంటే మతిపోతోంది అంతే. ఒక ప్రముఖ ఇంగ్లీష్‌ పత్రిక ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా గురించి ఒక కథనం ప్రచురించింది. ఇప్పుడు సురేందర్ రెడ్డి చెప్పిన యాక్షన్ సీక్వెన్సులు విని అవాక్కైపోయిన చిరంజీవి.. ''ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి'' సినిమాలోని గుర్రపు స్వారీ సీన్లన్నీ బాగా రావాలంటూ.. స్వారీ ప్రాక్టీస్ చేస్తున్నారట. ఇక్కడ అసలు సింక్ అనేది కనిపించట్లేదు.

నిజానికి గుర్రాలతో కూడా గింగిరీలు తిప్పించే రేంజ్ మెగాస్టార్ చిరంజీవిది. అప్పుడెప్పుడో వచ్చిన కొదమసింహం.. కొండవీటి దొంగ వంటి సినిమాల్లోనే ఆయన తన స్వారీతో అదరగొట్టేశాడు. గుర్రం ఠీవిగా స్వారి చేస్తుంటే.. దానిపై ఎంతో దర్జాగా కూర్చొని ఆ సవారీకే రాజసం తెప్పించడం చిరంజీవికి అలవాటు. మొన్ననే ఒక రోజు షూటింగ్ కు పిలిచి.. గుర్రం రైడ్ చేసే సీన్ ఉంది అనగానే.. బ్రూస్ లీ సినిమా కోసం వెంటనే రంగంలోకి దిగేశారు మెగాస్టార్. అటువంటిది ఇప్పుడు కొత్తగా ఆయన గుర్రపు స్వారీలు ప్రాక్టీస్ చేయడమేంటి? ఇదే వినడానికి కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంది.

ఒకవేళ మరేదైనా కత్తి యుద్దాలు.. గన్స్ తో కాస్త అటూ ఇటూ ఆడుకోవడాలు.. వంటి విన్యాసాలను చిరంజీవి నేర్చుకుంటున్నారు అంటే మాత్రం కాస్త నమ్మశక్యంగా ఉంటుందేమో. ఏదేమైనా కూడా ఇటువంటి పీరియడ్ చిత్రాలు అనేవి చిరంజీవి కెరియర్లోనే తొలిసారి చేస్తున్నారు కాబట్టి.. ఎలాంటి కోచింగ్ అయినా కూడా జాగ్రత్తగా తీసుకుంటూ.. సినిమాను బహుజాగ్రత్తగా తీయాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/