Begin typing your search above and press return to search.
మెగా రీమేక్ కి ముహూర్తం ఖరారు...!
By: Tupaki Desk | 3 Oct 2020 1:20 PM ISTమెగాస్టార్ చిరంజీవి మళయాళ సూపర్ హిట్ 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. చిరంజీవితో ఇంతకముందు 'ఠాగూర్' 'ఖైదీ నెం.150' వంటి రెండు సక్సెస్ ఫుల్ చిత్రాలు రూపొందించిన వీవీ వినాయక్.. హ్యాట్రిక్ హిట్ అందిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఆ రెండు సినిమాలు కూడా రీమేక్ చిత్రాలే అవడం గమనార్హం. ప్రముఖ రచయిత ఆకుల శివతో కలిసి వినాయక్ తెలుగు ప్రేక్షకులు అభిరుచికి తగ్గట్టుగా 'లూసిఫర్' కథలో మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల బెంగుళూరులో ఫైనల్ స్క్రిప్ట్ ని మెగాస్టార్ కి చెప్పాడని.. చిరు ఎలాంటి చేంజెస్ చెప్పకుండా ఈ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్ కి వచ్చే ఏడాది జనవరిలో కొబ్బరికాయ కొట్టేయాలని ముహూర్తం నిర్ణయించినట్టు ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న మెగాస్టార్.. ఇది కంప్లీట్ అయిన వెంటనే 'లూసిఫర్' తెలుగు రీమేక్ రెగ్యులర్ షూట్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో రామ్ చరణ్ మరియు ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారు. దీంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ్ 'వేదళం' రీమేక్ లో నటించేందుకు కూడా చిరు పచ్చ జెండా ఊపారు. ఈ ప్రాజెక్ట్ ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో బాబీ దర్శకత్వంలో కూడా చిరు ఓ సినిమా చేయనున్నాడు. ఏదేమైనా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతూ మెగాస్టార్ మెగా ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు.