Begin typing your search above and press return to search.
మెగాస్టార్ ఆత్మకథ డాక్యుమెంటరీ రూపంలో రానుందా...?
By: Tupaki Desk | 18 April 2020 2:20 PM ISTదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోయి అంతా ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ సమయాన్ని ఆత్మకథ రాసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగాడు చిరంజీవి. ఆయన కథ తెలుసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అయితే కొంతమంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల ఆటోబయోగ్రఫీలు బియోపిక్స్ గా రూపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు ఆటోబయోగ్రఫీ కూడా సినిమాగా రాబోతోందని వార్తలు వచ్చాయి. కానీ చిరు తన లైఫ్ లో బయోపిక్ చేసేంత ఎమోషన్స్ లేవని, ఎలాంటి ఒడిదుడుకులు లేని నా జీవితాన్ని బయోపిక్‌గా తీస్తే పెద్దగా డ్రామా పండదు అని చెప్పుకొచ్చారట.
అయితే తన సక్సెస్ ఫుల్ లైఫ్ లో, సినీ జీవితంలో డాక్యుమెంటరీ తీయడానికి సరిపడే స్టఫ్ ఉందని మెగాస్టార్ భావిస్తున్నాడట. దీంతో పాటు ఆయనకి సంభందించిన ఎన్నో వీడియోలు ఫోటోలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో మెగాస్టార్ సక్సెస్ ఫుల్ జర్నీని డాక్యుమెంటరీగా రూపొందిస్తే బాగుంటదని భావిస్తున్నారట. ఇప్పటికే ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర కూడా డాక్యుమెంటరీ డ్రామాగా వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు కూడా తన ఆటోబయోగ్రఫీని డాక్యుమెంటరీ డ్రామాగా తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనా మెగాస్టార్ ఆటోబయోగ్రఫీ మరి డాక్యుమెంటరీ వార్తలు విని మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కొణెదల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ లో భారీ అంచనాలే ఉన్నాయి.