Begin typing your search above and press return to search.

ఇంతకీ 'ఆర్ఆర్ఆర్' ప్రోమోలో మెగాస్టార్ వాయిస్ ఉన్నట్లా లేనట్లా..??

By:  Tupaki Desk   |   5 Jan 2021 2:00 PM IST
ఇంతకీ ఆర్ఆర్ఆర్ ప్రోమోలో మెగాస్టార్ వాయిస్ ఉన్నట్లా లేనట్లా..??
X
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమా మీ ఊహలకు కూడా అందకుండా ఉంటుందని చెప్పాడు రాజమౌళి. స్వాతంత్ర్య సమరయోధుల కథ అనేసరికి ఇంకాస్త ఇంటరెస్ట్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ గురించి ఒక వార్త తాజాగా ఇండస్ట్రీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి బృందం ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఒక ప్రోమో వీడియో రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అదీగాక ఆ ప్రోమో వీడియోకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే తెగ వైరల్ అవుతున్న ఈ వార్త పై ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అయితే ఆ వార్త నిజం కాకపోతే ఆల్రెడీ చెప్పేసేవారు.. మెగాస్టార్ వాయిస్ ఇవ్వడం అనేది నిజం కాబట్టి స్పందించట్లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరి దీని పై క్లారిటీ రావాల్సి ఉండగా.. గతంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా దేశభక్తికి సంబంధించింది కాదని, కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే సినిమా సాగుతుందని చెప్పుకొచ్చారు రాజమౌళి. ఈ మాటలు విన్న ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. దేశభక్తికి సంబంధం లేనప్పుడు రిపబ్లిక్ డే రోజునే ఎందుకు ప్రోమో రిలీజ్.. కల్పిత కథ కాబట్టి ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు కదా! అంటూ ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక హీరోయిన్లుగా అలియా భట్, ఓలివియా మోరిస్ నటిస్తున్నారు. ఇప్పటికే 'భీమ్ ఫర్ రామరాజు', రామరాజు ఫర్ భీమ్ వీడియోలకు అద్బుతమైన క్రేజ్ వచ్చింది. ఇక తాజాగా కొత్త ప్రోమో కూడా థ్రిల్లింగ్ గా ఉండబోతుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి మెగాస్టార్ వాయిస్ తో ప్రోమో ఉంటుందో లేదో..!!