Begin typing your search above and press return to search.

ప్లాప్ లలో ఉన్న యంగ్ హీరోకు అండగా మెగాస్టార్.. ఏ విధంగా..??

By:  Tupaki Desk   |   22 Dec 2020 3:59 PM GMT
ప్లాప్ లలో ఉన్న యంగ్ హీరోకు అండగా మెగాస్టార్.. ఏ విధంగా..??
X
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్.. తన కెరీర్ మొదట్లో మంచి హిట్స్ అందుకున్నప్పటికి గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. తన ప్రతీ సినిమాలో వైవిద్యత కనబరుస్తున్నా.. ఎందుకో మరి ఆది సినిమాలు సినీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. మొదటి నుండి కూడా డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఆది. అయితే ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. హిట్స్ ఫ్లాప్స్ గురించి పక్కన పెడితే.. సినిమాలు చేయడం మాత్రం ఆపలేదు ఆది. అయితే ఈ ఏడాది మొదట్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా శశి. ఆది సాయికుమార్, సురభి హీరో హీరోయిన్లుగా నటించగా.. నడికట్ల శ్రీనివాస్ నాయుడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

అయితే లాక్ డౌన్ కారణంగా ఇన్నినెలలు విడుదలకు నోచుకోని శశి సినిమాను త్వరలో విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే త్వరలో రిలీజ్ చేయనున్న శశి సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయనున్నట్లు సమాచారం. సీనియర్ యాక్టర్ సాయికుమార్ కోరిక మేరకు ఆన్ లైన్ ద్వారా మెగాస్టార్ శశి మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తారట. ఇక మెగాస్టార్ - సాయికుమార్ లకు మధ్య ఉన్న మంచి స్నేహం కారణంగా సాయికుమార్ కొడుకు ఆదికి చిరు ఇలా సహకరిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆది చేతిలో బ్లాక్, జంగిల్ సినిమాలతో పాటు ఓ థ్రిల్లర్ మూవీ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి చిరు విడుదల చేయనున్న శశి ట్రైలర్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో..!