Begin typing your search above and press return to search.
చిరు పాజిటివ్ కాదు.. మొదటి రిపోర్ట్ తప్పు
By: Tupaki Desk | 13 Nov 2020 8:22 AM ISTమెగాస్టార్ చిరంజీవి సోమవారం కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన వెంటనే అంతా కూడా షాక్ అయ్యారు. చిరంజీవి వయసు రీత్యా ఆయన ఆరోగ్యం విషయమై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ప్రకటన తర్వాత గురువారం వరకు చిరంజీవి నుండి ఎలాంటి హెల్త్ బులిటెన్ రాకపోవడంతో అభిమాలు చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు మెగాస్టార్ నుండి మరో అప్ డేట్ వచ్చింది. అందులో ఆయన హెల్త్ బులిటెన్ కాదు ఏకంగా కరోనా లేదు అంటూ ప్రకటన ఉంది. టెస్టు రిపోర్ట్ తప్పు అవ్వడం వల్ల గందరగోళం క్రియేట్ అయ్యిందన్నాడు.
సోషల్ మీడియాలో రిపోర్ట్ షేర్ చేసిన చిరంజీవి.. కరోనా గత నాలుగు రోజులుగా నన్ను బాగా కన్ఫ్యూజ్ చేసి నాతో ఆడేసుకుంది. ఆదివారం టెస్టు పాజిటివ్ అన్న తర్వాత బేసిక్ మెడిసిన్ స్టార్ట్ చేశాను. రెండు రోజులైనా లక్షణాలు లేకపోయేసరికి నాకే అనుమానం వచ్చి అపోలో వైధ్యులను అప్రోచ్ అయ్యాను. వారు సీటీ స్కాన్ తీసి చెస్ట్ లో ఎలాంటి ట్రేస్ లేవు అంటూ నిర్థారణకు వచ్చారు. అక్కడ రిజల్ట్ నెగటివ్ వచ్చాక మరోసారి మరో చోట నివృత్తి చేసుకోవాలని నేను టెంట్ ల్యాబ్ కు వెళ్లాను. అక్కడ మూడు రకాల కిట్స్ తో పరీక్షలు చేశారు. అక్కడా నెగటివ్ వచ్చింది. చివరగా నాకు ఆదివారం పాజిటివ్ వచ్చిన చోట కూడా టెస్టు చేయించగా నెగటివ్ వచ్చింది. ఈమూడు రిపోర్ట్ ల వల్ల మొదటి రిపోర్ట్ కిట్ తప్పిదం వల్ల పాజిటివ్ వచ్చిందని వైధ్యులు నిర్థారించారు. ఈ సమయంలో మీరు అంతా చూపించిన ప్రేమాభిమానంకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు. చిరు కరోనా లేదని వెళ్లడవ్వడంతో మళ్లీ ఆచార్య సందడి మొదలు అయ్యే అవకాశం ఉంది.