Begin typing your search above and press return to search.

స్టార్స్‌ కు చిరు 'పాజిటివ్‌' ఒక గుణపాఠం

By:  Tupaki Desk   |   10 Nov 2020 9:00 AM IST
స్టార్స్‌ కు చిరు పాజిటివ్‌ ఒక గుణపాఠం
X
నిన్న చిరంజీవి చేసిన ప్రకటన ఒక్కసారిగా టాలీవుడ్‌ ను షేక్‌ చేసింది. ఆరు పదుల వయసు దాటిన వారు కరోనాతో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటూ మొదటి నుండి వైధ్యుల నుండి డబ్ల్యూ హెచ్‌ ఓ హెచ్చరిస్తూనే ఉంది. అయినా కూడా జాగ్రత్తలు పాటించకుండా సినీ ప్రముఖులు కొందరు పబ్లిక్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. షూటింగ్స్‌ కు అయితే భయపడ్డ కొందరు స్టార్స్‌ జనాలు అధికంగా హాజరు అయిన వేడుకలు ఇతరత్ర కార్యక్రమాలకు మాత్రం హాజరు అవుతూ వచ్చారు. చిరంజీవి మార్చి నుండి సెప్టెంబర్‌ వరకు కనీసం బయటకు కూడా వెళ్లకుండా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. ఇటీవలే ఆయన మెల్ల మెల్లగా బయటకు రావడం ప్రారంభించారు.

సన్నిహితుల వివాహాది శుభకార్యాలకు మరియు ముఖ్యమైన వేడుకలకు హాజరు అవుతూ వచ్చాడు. ఆ సందర్బంగానే కరోనా అంటి ఉంటుందని అంటున్నారు. ఈ వయసులో కరోనా అంటే ఏదో ఒక మూలన చిన్న భయం అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో అయిదు పదుల హీరోలు ఆరు పదుల హీరోలు చాలా మందే ఉన్నారు. వారంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది చిరంజీవి విషయం గుణపాఠం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

షూటింగ్స్‌ కు సీనియర్‌ లు మరికొంత కాలం దూరంగా ఉన్నా కూడా పోయేది ఏమీ లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి కరోనా పాజిటివ్‌ అంటూ రిపోర్ట్‌ రావడంతో టాలీవుడ్‌ లో కాస్త అలజడి వాతావరణం కనిపిస్తుంది. కొందరు షూటింగ్‌ లకు వెళ్లాలని అనుకున్న వారు కూడా ఈ రెండు నెలలు వెయిట్‌ చేద్దాం. 2021లో ఫ్రెష్‌ గా ప్రారంభించేద్దాం అనుకుంటున్నారని టాక్‌ వినిపిస్తుంది. చిరంజీవి గారు త్వరగా కోలుకోవాలని అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.