Begin typing your search above and press return to search.

సైరా ని అలా వదులుతారా?

By:  Tupaki Desk   |   11 Sep 2018 10:16 AM GMT
సైరా ని అలా వదులుతారా?
X
శాండల్ వుడ్ లో ఎప్పటి నుంచో ఉన్న డబ్బింగ్ నిషేధం మెల్లగా తొలగిపోయి ఇతర బాషా చిత్రాలకు కొత్త మార్కెట్ సృష్టిస్తోంది. ఇప్పటి దాకా కేవలం రీమేకులకు మాత్రమే అనుమతి ఉన్న కన్నడ సినిమా పరిశ్రమలో ఇటీవలే డబ్బింగ్ పరంగా ఉన్న ఆంక్షలు తొలగించడంతో తెలుగు తమిళ నిర్మాతల ఆనందం మాములుగా లేదు. ఇటీవలే అజిత్ మూవీ వివేగంని కన్నడలో కమాండో పేరుతో డబ్ చేసి వదిలితే సూపర్ హిట్ అయ్యి కూర్చుంది. ఇక్కడ బిలో యావరేజ్ అనిపించుకున్న మూవీ అక్కడ అంతలా ఆడటానికి కారణం ఇతర స్టార్ హీరోలు కన్నడ డైలాగులు పలకడం చూసి అక్కడి ప్రేక్షకులు మురిసిపోవడమే. ఇప్పుడు రానున్న క్రేజీ సినిమాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా సైరాని కన్నడ డబ్బింగ్ చేయాల్సిందే అంటూ అక్కడి అభిమానులు ఇప్పటికే డిమాండ్ వినిపిస్తున్నారు.

దీనికి కారణం ఉంది. మెగాస్టార్ చిరంజీవికి అక్కడ చాలా బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఘరానా మొగుడు మొదలుకుని ఖైదీ నెంబర్ 150 దాకా బెంగళూరు బళ్లారి లాంటి సెంటర్స్ లో మెగా రికార్డ్స్ ఉన్నాయి. దాంతో పాటు కన్నడ స్టార్ హీరో సుదీప్ ఇందులో అరకురాజుగా నటిస్తుండటంతో అతని ఫాన్స్ ట్విట్టర్ లో వీ వాంట్ డబ్బింగ్ అంటూ యాష్ ట్యాగులు కూడా మొదలుపెట్టారు. ఒకవేళ అదే కనక జరిగితే సైరా కన్నడ డబ్బింగ్ కు సాధారణంగా వచ్చే వసూళ్లకు కనీసం రెండింతలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అక్కడి ట్రేడ్ టాక్. గతంలో బాహుబలి 2 ని డబ్బింగ్ చేయడానికి ప్రయత్నిస్తేనే అక్కడి నిర్మాతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసి చివరికి జరగకుండా చూసారు. ఇప్పుడు వివేగం దారి చూపింది కాబట్టి సైరా మాత్రమే కాదు సాహో - 2.0 లాంటి క్రేజీ మూవీస్ కి కొత్త దారి దొరికినట్టు అయ్యింది. సైరా విడుదలకు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ ఆ మేరకు ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలుపెడితే అప్పటికి ఓ కొలిక్కి రావొచ్చు. చివరి నిమిషంలో హడావిడి తేడా కొట్టించే అవకాశం ఉంది.