Begin typing your search above and press return to search.

అల్లుడికోసం మెగా స్టార్ అలా..!

By:  Tupaki Desk   |   2 Nov 2018 12:51 PM IST
అల్లుడికోసం మెగా స్టార్ అలా..!
X
మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ ఊపును చూసి మొదట్లో మరో స్టార్ వచ్చాడని అనుకున్నారు. కానీ అప్పటినుండి స్టార్ట్ అయింది ఫ్లాపుల గోల. అది డబల్ డిజాస్టర్ హ్యాట్రిక్ మూటగట్టుకునేంతవరకూ వెళ్ళింది. ఇక లాభం లేదనుకుని ఓ మూడు నెలలు బ్రేక్ తీసుకున్నాడు తేజు. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్ర లహరి' ప్రారంభం అయింది.

ఇక ఈ సినిమాగురించి ఫిలిం నగర్లో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా విజయం తేజూకి చాలా కీలకం కావడంతో మావయ్య చిరంజీవినిని కలిసి స్క్రిప్ట్ విషయంలో ఏవైనా లోటు పాట్లు ఉంటే సరిచేయమని కోరాడట. దీంతో మేనల్లుడి కోసం స్క్రిప్ట్ ను పరిశీలించి కొన్ని మార్పుచేర్పులు సూచించారట మెగాస్టార్. సహజంగా చిరు తేజు సినిమాల విషయంలో ఎడిటింగ్ సమయంలో ఏవైనా మార్పు చేర్పులుంటే సూచనలు అందిస్తారు. కానీ సారి మాత్రం షూటింగ్ కంటే ముందే తేజు సినిమాకి తన సూచనలు అందించడం విశేషం.

ఈ సినిమాలో తేజు సరసన 'హలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతోనైనా తనకు విజయం లభిస్తుందని తేజు నమ్మకంగా ఉన్నాడు.