Begin typing your search above and press return to search.

చిరు సేఫ్ గేమ్ వ‌ర్క‌వుటైందిగా!

By:  Tupaki Desk   |   12 Jan 2017 6:29 AM GMT
చిరు సేఫ్ గేమ్ వ‌ర్క‌వుటైందిగా!
X
సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజే వేరు. పాత్ర ఏదైనా త‌న‌దైన శైలిలో ఒదిగిపోయే చిరు... .జ‌నం మెచ్చిన చిత్రాల‌ను చాలానే చేశారు. అందులో మాస్ మ‌సాలా ఉన్న చిత్రాల‌తో పాటు వైవిధ్య‌భ‌రిత క‌థ‌నాలున్న చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంద‌ర్భంగా ఎలాంటి చిత్ర‌మైతే... బాగుంటుంద‌న్న కోణంలో ఆలోచించిన చిరు.... స‌క్సెస్‌ ఫుల్ మంత్రమే ఎన్నుకున్న‌ట్లుగా ఉంది. నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిరు 150వ చిత్ర ఖైదీ నెంబ‌రు 150 చిత్రానికి వ‌స్తున్న క‌లెక్ష‌న్లే ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు.

అయితే ఖైదీ నెంబ‌రు చిత్రానికి ఈ త‌ర‌హా స్పంద‌న‌ - క‌లెక్ష‌న్లు వ‌స్తాయ‌ని అటు చిరు కాని, ఇటు సినీ జ‌నం కానీ ఉహించలేద‌నే చెప్పాలి. ఎందుకంటే... రాజ‌కీయాల్లోకి వెళ్లిన చిరంజీవి... దాదాపు తొమ్మిదేళ్లుగా సినిమాల‌కు దూరంగా జ‌రిగారు. అంతేకాకుండా సినిమాల్లో మాదిరి ఆయ‌న పాలిటిక్స్‌లో స‌క్సెస్ కాలేక‌పోయారు. కొత్త‌గా స్థాపించిన పార్టీని ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో క‌లిపేసిన ఆయ‌న త‌న ముచ్చ‌ట మాత్రం తీర్చుకున్నారు. కేంద్ర మంత్రి ప‌ద‌విని చేప‌ట్ట‌డం మిన‌హా పాలిటిక్స్‌లో చిరు సాధించిందేమీ లేద‌నే చెప్పాలి.

ఈ క్ర‌మంలో తిరిగి సినిమాల్లోకి రాక త‌ప్ప‌ని ప‌రిస్థితి చిరుది. అయితే తొమ్మిదేళ్ల గ్యాప్‌ - ఆపై పాలిటిక్స్‌లో ప‌రాభ‌వం - జ‌నం త‌న‌ను ఆరాధిస్తారో? ల‌ఏదో?న‌నే డౌటు చిరును అయోమ‌యానికి గురి చేశాయ‌నే చెప్పాలి. ఈ అయోమ‌యానికి చెక్ పెట్టేందుకు చాలా లోతుగానే ఆలోచించిన చిరు... ఎట్ట‌కేల‌కు స‌క్సెస్ సాధించారు. ప్ర‌స్తుతం ఖైదీ చిత్రానికి వ‌స్తున్న క‌లెక్ష‌న్ల‌ను చిరు కూడా ముందుగా అంచ‌నా వేయ‌లేక‌పోయారు. ఈ మాట వేరెవ‌రో చెప్పింది కాదు. స్వ‌యంగా చిరునే ఈ విష‌యం చెప్పారు. అస‌లు త‌నను జ‌నం ఇంత బాగా రిసీవ్ చేసుకుంటార‌ని అనుకుని ఉంటే... క‌త్తి లాంటి రీమేక్‌ తో రీ ఎంట్రీ ఇచ్చేవాడు కాదేమో అని అనుకుంటున్నారు.

చాలా కాలం త‌ర్వాత.. అది కూడా దాదాపుగా రీ ఎంట్రీ ఇస్తున్న సంద‌ర్భంగా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం... అది రీమేక్ అయినా... క‌త్తిని చేసేందుకే చిరు డిసైడ్ అయిపోయారు. అంతే త‌ప్ప చాలా గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న స‌మ‌యంలో స్ట్ర‌యిట్ చిత్రం చేసి రిస్క్ తీసుకోవాల‌ని ఆయ‌న చూడ‌లేదు. అయితే క‌థ‌, క‌థ‌నం.... ఏదైనా చిరుపై త‌మ‌కు ఏమాత్రం క్రేజ్ త‌గ్గ‌లేద‌ని జ‌నం చెప్పేశారు. అంటే... టాలీవుడ్‌ లోకి చిరు రీ ఎంట్రీ అదిరింద‌నే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/