Begin typing your search above and press return to search.

ర‌వితేజ ఎంట్రీతోనే మ‌రో లెవ‌ల్ కి వెళ్లిపోతుంది!- చిరంజీవి

By:  Tupaki Desk   |   8 Jan 2023 5:44 PM GMT
ర‌వితేజ ఎంట్రీతోనే మ‌రో లెవ‌ల్ కి వెళ్లిపోతుంది!- చిరంజీవి
X
20323 సంక్రాంతి బ‌రిలో వీర‌సింహారెడ్డి- వాల్తేరు వీర‌య్య నువ్వా నేనా? అంటూ పోటీప‌డుతూ విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండు సినిమాల‌ను మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌డం ఇలా ఒకేసారి రిలీజ్ చేయ‌డం ఏ ఇండ‌స్ట్రీలోను సాధ్యం కాదు. ఇది ఒక రికార్డ్ అని ప్ర‌శంసించారు మెగాస్టార్ చిరంజీవి. వైజాగ్ లో వాల్తేరు వీర‌య్య ప్రీరిలీజ్ వేడుక‌లో చిరు ఎంతో ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు. ఇక నిర్మాత‌ల గురించి ప్ర‌స్థావిస్తూ.. వారికి రెండు సినిమాలు రెండు క‌ళ్లు. రెండూ విజ‌యం సాధించాలి. రెండూ సూప‌ర్ డూప‌ర్ హిట్లు అవుతాయి. ప‌రిశ్ర‌మ‌లో నిర్మాత‌లు నిల‌బ‌డాలి. చాలా మంది ప్ర‌శంస‌ల‌ను ఇంధ‌నంలా తీసుకుని రాకెట్ లా మైత్రి నిర్మాత‌లు దూసుకెళ్లాలి.. అని అన్నారు.

త‌మ్ముడు రవితేజ గురించి మాట్లాడుతూ ..అత‌డు తెలుగు వాడు కాదు.. విజ‌య‌వాడ అన్నాడు కానీ కాదు! అని ఛ‌మ‌త్క‌రిస్తూనే ర‌వితేజ‌ బాంబేలో పెరిగాడ‌ని చిరు ఒక పెద్ద ర‌హ‌స్యాన్ని లీక్ చేసారు. హిందీ చిత్రం `ఆజ్ కా గూండారాజ్` లో నా స్నేహితుడుగా న‌టించాడు. అత‌డు పుట్టి పెరిగింది ముంబైలో. అత‌డు హిందీలో మాట్లాడ‌టం స్టైల్ చూస్తే బాంబే క‌న‌బ‌డుతుంది. అమితాబ్ ని అమితంగా ఇష్ట‌ప‌డ‌తాడు. సౌత్ లో న‌న్ను ఇష్ట‌ప‌డ‌తాడు. ర‌వితేజ అల్ల‌రివాడు. అత‌డిలో వెట‌కారం కూడా ఉంటుంది. నేను చేస్తే కామెడీ అత‌డు చేస్తే వెట‌కారం. వాల్తేరు వీర‌య్య‌లో మా కాంబినేష‌న్ సీన్లు అన్నీ ఆక‌ట్టుకుంటాయి. సీట్ అంచున కూచుని సినిమా చూస్తారు. బాబి నా న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా ఈ సినిమాని అద్భుతంగా తెర‌కెక్కించారు`` అని అన్నారు.

ర‌వితేజ ఎక్క‌డైతే వ‌స్తాడో అక్క‌డ సినిమా మ‌రో లెవ‌ల్ కి వెళుతుంద‌ని చిరు ఎంతో ఎగ్జ‌యిట్ అయ్యారు. ఆ పాత్ర ర‌వితేజ కాక‌పోతే న్యాయం జ‌రిగేది కాదు. ర‌వితేజ ద్వారానే ఆ పాత్ర‌కు ఆ రేంజు.. టాలీవుడ్ లో వ‌రుస పెట్టి సినిమ‌లు తీస్తున్న వాళ్లు ఇద్ద‌రే ఇద్ద‌రు. అందులో నేను ఒక‌డిని. ఇంకొక‌డు ర‌వితేజ.. ఇంత బిజీలోను నా సినిమాలో న‌టించాడు! అంటూ చిరు త‌న‌దైన స్టైల్లో కామిక్ టైమింగ్ తో అన‌డం న‌వ్విస్తుంది. ఇక ఈ వేదిక‌పై ఇత‌ర టెక్నీషియ‌న్ల‌ను ప్ర‌శంసించిన చిరు.. క‌థానాయిక‌ల గురించి మాట్లాడారు. శ్రుతి హాస‌న్ మైనస్ డిగ్రీల చలిలో చీర‌క‌ట్టులో న‌టించింది. త‌ను ఎంతో అందంగా క‌నిపిస్తుంది. చాలా గుంబ‌నంగా ఉండే పాత్ర‌లో కీల‌కమైన పాత్ర‌లో కేథ‌రిన్ నటించ‌గా ఊర్వశి చ‌క్క‌ని డ్యాన్సుల‌తో అల‌రించిందని ప్ర‌శంసించారు. ఈ వేదిక‌పై బాబి అభిమానాన్ని ప్ర‌తిభ‌ను చిరు ప్ర‌త్యేకంగా కీర్తించారు.

ఇక ఈవెంట్ జ‌రుగుతున్నంత సేపు వీఐపీ గ్యాల‌రీలో కూచున్న చిరు ఎంతో ఎమోష‌న‌ల్ గా క‌నిపించారు. విశాఖ‌తో త‌న అనుబంధం గురించి ఆరంభ‌మే గుర్తు చేసుకుంటూ ఇక మిగ‌తా జీవితాన్ని ఇక్క‌డే గడుపుతాన‌ని విశాఖ వాసుల‌కు ప్రామిస్ చేసారు. వాల్తేరు వీర‌య్య జ‌న‌వ‌రి 13న సంక్రాంతి కానుక‌గా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతోంది. థియేట‌ర్ల‌లో పూన‌కాలు చూడండి అంటూ చిరు అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌రిచారు. ఇక చిరు స్పీచ్ ఆద్యంతం అభిమానులు క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో మెగా ర‌చ్చ చేసారు. చిరు శైలి విరుపు హాస్యం వేదిక‌కు కొత్త‌ క‌ళ‌ను తెచ్చింది. ఈవెంట్ లో స్పీచ్ ల‌న్నీ ఒకెత్తు అనుకుంటే చిరు ఒక్క‌డే ఒకెత్తు. అందుకే ``అత‌డు ఒక్క‌డే మెగాస్టార్`` అని బాబి అన్న‌దానిని అంద‌రూ అంగీక‌రించాలి.