Begin typing your search above and press return to search.

చిరు సాంగ్ కి చిందేసిన సుబ్రహ్మణ్యం..

By:  Tupaki Desk   |   17 Aug 2015 10:35 PM IST
చిరు సాంగ్ కి చిందేసిన సుబ్రహ్మణ్యం..
X
ఒక్కమాటలో చెప్పాలంటే మాస్ అంటే చిరంజీవి.. చిరంజీవి అంటే మాస్... గళ్ళ లుంగీ కట్టుకుని స్టెప్పులు ఇరగదీసినా, వాన జల్లుల్లొ హీరోయిన్లతో చిందేసినా, టైటిల్ సాంగ్ లతో దుమ్ము దులిపెసినా అది చిరంజీవికే సొంతం. అందుకే చిరు పాటలు ఇప్పటికీ మూడ్ చేంజర్స్ గా నిలిచిపోతాయి.

అందుకనే చిరంజీవి నట వారసుడిగా వచ్చిన చరణ్ కూడా తన తండ్రి అల్ టైం హిట్స్ ని రీమిక్స్ చెయ్యడంలో వెనుకాడలేదు. బంగారుకోడిపెట్ట, వానా వానా, శుభలేఖ రాసుకున్న.. ఇలా అన్ని రీమిక్స్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మెగా ఫ్యామిలీనుండి వచ్చిన మరో హీరో చిరు పాటను రీమిక్స్ చేస్తున్నట్టు సమాచారం.

హరీష్ శంకర్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలో మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్ ఒకదాన్ని రీమిక్స్ చేశారట. ఏ పాట అన్నది ఆడియో విడుదల వేడుకనాడు ప్రకటిస్తారట. ఈ రీమిక్స్ సాంగ్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలవనుందట. నిన్న ప్రదర్శించిన సిని 'మా' అవార్డులలో సాయి గాంగ్ లీడర్ పాటకు స్టెప్పులేశాడు. ఈ విధంగా మనకేమన్నా క్లూ ఇచ్చాడంటారా?