Begin typing your search above and press return to search.

నేను ఇండ‌స్ట్రీ పెద్ద‌గా ఉండ‌ను!-మెగాస్టార్ చిరంజీవి

By:  Tupaki Desk   |   2 Jan 2022 7:47 AM GMT
నేను ఇండ‌స్ట్రీ పెద్ద‌గా ఉండ‌ను!-మెగాస్టార్ చిరంజీవి
X
ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ రావు మ‌ర‌ణానంత‌రం ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కు ఎవ‌రు? అన్న స‌మ‌స్య పెద్ద ఎత్తున తెర‌పైకి వ‌చ్చింది. దీనిపై దాస‌రి శిష్యులు ప‌లు సంద‌ర్భాల్లో టాలీవుడ్ పెద్ద‌గా మెగాస్టార్ చిరంజీవిని త‌ప్ప ఇంక ఎవ‌రినీ ఊహించుకోలేమ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దాస‌రి ప్రియాతి ప్రియ‌మైన శిష్యులైన త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజా- సి.క‌ళ్యాణ్ -రేలంగి న‌ర‌సింహారావు- క్రిటిక్ ప్ర‌భు వంటి ప్ర‌ముఖులు మెగాస్టార్ చిరంజీవిని ప‌రిశ్ర‌మ పెద్ద‌గా ఆహ్వానిస్తోంద‌ని మీడియా ముందు వ్యాఖ్యానించారు. ఇటీవ‌ల క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ని ప్రారంభించి చిరు ఇండ‌స్ట్రీని కార్మికుల్ని ఆదుకున్న సంద‌ర్భంలోనూ చిరు త‌ప్ప ఇంకెవ‌రినీ పెద్ద‌గా చూడ‌లేమ‌ని వ్యాఖ్యానించారు.

అయితే తాజాగా ఓ స‌మావేశంలో మెగాస్టార్ చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపుతున్నాయి. తాను ప‌రిశ్ర‌మ పెద్ద‌గా ఉండ‌న‌ని చిరంజీవి వ్యాఖ్యానించారు. ``బాధ్య‌త తీసుకుంటాను.. కానీ పెద్ద‌గా ఉండ‌ను. నా హ‌ర్ట్ అండ్ షోల్డ‌ర్ పై బాధ్య‌త తీసుకుంటాను. మీకు అందుబాటులో ఉంటాను. ఇద్ద‌రు ఎవ‌రో కొట్టుకుంటే త‌గువు తీర్చ‌లేను. ఏ రెండు అసోసియేష‌న్ల కొట్లాట‌లో నేను తీర్చను. మంచి కోసం నేను వ‌స్తాను. అవ‌స‌రం మేర ప‌రిశ్ర‌మ‌కు అండ‌గా ఉంటాను. ప‌రిశ్ర‌మ‌లో వ్య‌క్తుల‌ ఆరోగ్య స‌మ‌స్య ఉపాధి స‌మ‌స్య అంటే సాయం ఉంటాను. స‌మ‌గ్రంగా ప‌రిశ్ర‌మ‌కు అండ‌గా నిలుస్తాను. ఇద్ద‌రు వ్య‌క్తుల్ని కాదు ప‌రిశ్ర‌మ‌ను దృష్టిలో పెట్టుకుని పెద్ద‌గా ఉంటాను త‌ప్ప ఒక‌రిద్ద‌రి కోసం ఉండను`` అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు.

మొత్తానికి ప‌రిశ్ర‌మ పెద్ద‌గా అవ‌కాశం కోసం ఎవ‌రు ఎదురు చూస్తున్నారో కానీ.. మెగాస్టార్ నోట రాకూడ‌ని మాట వ‌చ్చింద‌న్న గుస‌గుస వినిపిస్తోంది. ఇక స్వ‌త‌హాగానే గొడ‌వ‌లు పంచాయితీలు అంటే దూరంగా ఉండే మెగాస్టార్ చిరంజీవి రియ‌ల్ టైమ్ రాజ‌కీయాల్లోనూ ఇమ‌డ‌లేక‌పోయారు. ఇప్పుడ ప‌రిశ్ర‌మ రాజకీయాల్ని త‌న నెత్తికెత్తుక‌నేందుకు సిద్దంగా లేనని చెప్ప‌క‌నే చెప్పారంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. బ్ల‌డ్ బ్యాంక్ - ఐ బ్యాంక్ వంటి సేవాకార్య‌క్ర‌మాల‌తో పాటు ప‌రిశ్ర‌మ‌లో క‌ష్టం ఉంటే మాత్ర‌మే తాను ఆదుకునేందుకు వ‌స్తాన‌ని చిరు బాహాటంగా బ‌హిరంగంగా చెప్పారు. దీనిపై ఇండ‌స్ట్రీలో అన్ లిమిటెడ్ గా డిబేట్ సాగుతోంది. మీడియా లోనూ ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి .