Begin typing your search above and press return to search.

చిరుతో జాక్ పాట్.. మోహ‌న్ రాజా రేర్ ట్రాక్ రికార్డ్

By:  Tupaki Desk   |   17 Dec 2020 1:30 AM GMT
చిరుతో జాక్ పాట్.. మోహ‌న్ రాజా రేర్ ట్రాక్ రికార్డ్
X
లూసీఫ‌ర్ రీమేక్ కి మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు అంటూ మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు ఖైదీనంబ‌ర్ 150 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన కంబ్యాక్ ఇచ్చిన ద‌ర్శ‌కుడిని కాద‌ని మోహ‌న్ రాజాకే మెగాస్టార్ ఎందుక‌ని అవ‌కాశం ఇచ్చారు? అంటే.. అత‌డిలో మ్యాట‌ర్ ఎంతో తెలుసుకుని తీరాల్సిందే.

మోహ‌న్ రాజా ప్ర‌ఖ్యాత ఎడిట‌ర్ మోహ‌న్ వార‌సుడిగా సుప‌రిచితం. ఆయ‌న త‌మిళంలో పాపుల‌ర్ డైరెక్ట‌ర్. ఐదు తెలుగు సినిమాల్ని త‌మిళంలోకి రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్లు చేసిన రికార్డ్ త‌న‌కు ఉంది. జ‌యం .. అమ్మ నాన్న త‌మిళ‌మ్మాయి.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా? బొమ్మ‌రిల్లు.. కిక్.. చిత్రాల్ని త‌మిళంలో నూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా మ‌లిచారు. జ‌యం సినిమాతోనే త‌న సోద‌రుడు ర‌విని హీరోని చేశారు మోహ‌న్ రాజా. ఆ సినిమా స‌క్సెస్ సాధించాక హీరో ర‌వి `జయం ర‌వి`గా పాపుల‌ర‌య్యాడు. తెలుగులో అద్భుత విజ‌యం సాధించిన `ఆర్య` సినిమాని ప‌దేళ్ల త‌ర్వాత ద‌ళ‌ప‌తి విజ‌య్ తో రీమేక్ చేసి అక్క‌డా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించారు మోహ‌న్ రాజా. ఇటీవ‌లే శివ‌కార్తికేయ‌న్ హీరోగా `వేళై కార‌న్` అనే సినిమా తీశారు.

ఎడిట‌ర్ మోహ‌న్ నిర్మించిన `హిట్ల‌ర్` సినిమాకి ముత్యాల సుబ్బ‌య్య వ‌ద్ద మోహ‌న్ రాజా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశారు. ఇప్పుడు చిరంజీవిని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటార‌నే అభిమానులు భావిస్తున్నారు. ఇంత‌కుముందు అర్జున్- జ‌గ‌ప‌తిబాబు-వేణు ప్ర‌ధాన పాత్ర‌ల్లో `హ‌నుమాన్ జంక్ష‌న్` సినిమాకి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యం సాధించిన `త‌ని ఒరువ‌న్` (జ‌యం ర‌వి హీరో) ద‌ర్శ‌కుడిగా అత‌డి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `ధృవ` టైటిల్ తో త‌నిఒరువ‌న్ రీమేకై తెలుగులోనూ ఘ‌న‌విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం మోహ‌న్ రాజా `త‌ని ఒరువ‌న్` సీక్వెల్ పైనా క‌స‌ర‌త్తు చేస్తున్నార‌న్న స‌మాచారం ఉంది.