Begin typing your search above and press return to search.

ఏప్రిల్‌ 8 ప్రత్యేకత సస్పెన్స్‌ కు తెరదించిన చిరు

By:  Tupaki Desk   |   8 April 2020 12:00 PM IST
ఏప్రిల్‌ 8 ప్రత్యేకత సస్పెన్స్‌ కు తెరదించిన చిరు
X
చిరంజీవి ఉగాది రోజున ట్విట్టర్‌ లో జాయిన్‌ అయిన విషయం తెల్సిందే. ఆరోజు నుండి క్రమం తప్పకుండా ఏదో ఒక విషయాన్ని ట్వీట్‌ చేస్తూనే వస్తున్నారు. ఈ కరోనా విపత్తు నేపథ్యంలో జనాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల నుండి పలు విషయాల వరకు ఎన్నో ఎనెన్నో విషయాలను ట్వీట్స్‌ రూపంలో షేర్‌ చేస్తూ వచ్చాడు. అయితే గత రెండు రోజులుగా చిరంజీవి ఏప్రిల్‌ 8వ తారీకుతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది అదేంటో 8వ తారీకు చెప్తాను అంటూ సస్పెన్స్‌ లో ఉంచిన విషయం తెల్సిందే.

ఏప్రిల్‌ 8వ తారీకున అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్బంగా చిరంజీవికి ఆ రోజు ప్రత్యేకం అయ్యి ఉంటుంది. ఏదో సంఘటన బన్నీ పుట్టిన రోజున జరిగి ఉంటుంది. ఆ విషయాన్ని చిరంజీవి చెప్పబోతున్నాడు అంటూ చాలా మంది అనుకున్నారు. కాని కొందరు మాత్రం బన్నీ పుట్టిన రోజు కాకుండా మరేదో ఉంది అనుకున్నారు. ఎట్టకేలకు చిరంజీవి సస్పెన్స్‌ కు తెర దించారు. ఈ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటీ అనే విషయంను చెబుతూ తన గతంలోకి వెళ్లారు.

ఈ రోజు హనుమాన్ జయంతి. ఈ రోజుతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒక రోజు నాకు లాటరీలో ఆంజనేయ స్వామి బొమ్మ వచ్చింది. ఆ బొమ్మను తీసుకుని నాన్నగారి వద్దకు వెళ్లిన సమయంలో ఆ బొమ్మను చూసిన నాన్న కను బొమ్మలు.. ముక్కు.. కళ్లు అచ్చం నీకులాగే ఉన్నాయని అన్నారు. ఆ ఫొటో ఇప్పటికి నా వద్ద ఉంది. ఆ సమయంలో నేను ఇలా ఉన్నాను అంటూ చిరంజీవి తన పాత ఫొటోను షేర్‌ చేశారు.

దాంతో పాటు 2002 సంవత్సరంలో బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామి బొమ్మను చిత్రించి పంపుతానన్నారు. నేను దాన్ని పాలరాతి బొమ్మ మీద రీ క్రియేట్‌ చేయించి పూజ గదిలో పెట్టించాను. ఆ బొమ్మ నాకు ఇచ్చే సమయంలో ఆయన నాతో.. అదేంటో అండీ బొమ్మను గీస్తూ ఉంటే మీ పోలికలే వచ్చాయి. మార్చలేదు అలాగే ఉంచి ఇస్తున్నాను అన్నాడు. ఒక చిత్రకారుడి నుండి అలాంటి కామెంట్‌ అందుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది అంటూ హనుమాన్ జయంతి తో తనకున్న అనుబంధం.. హనుమంతుడితో ఉన్న తనకున్న సంబంధంను గురించి చిరంజీవి చెప్పుకొచ్చారు.