Begin typing your search above and press return to search.

#నిహారిక పెళ్లి.. గారాల ప‌ట్టీకి మెగాస్టార్ 2కోట్ల విలువైన కానుక‌

By:  Tupaki Desk   |   9 Dec 2020 10:10 AM IST
#నిహారిక పెళ్లి.. గారాల ప‌ట్టీకి మెగాస్టార్ 2కోట్ల విలువైన కానుక‌
X
నిహారిక కొణిదెల‌- చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ వివాహ వేడుకలు రాజస్థాన్ ఉదయపూర్ లో జరుగుతున్నాయి. ఒబెరాయ్ ఉదయ్ విలాస్ భ‌వంతిలో వేడుకలు అత్యంత వైభ‌వంగా మెగా రేంజును త‌ల‌పిస్తున్నాయి. ఇప్ప‌టికే వెన్యూ వ‌ద్ద సంద‌డికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఇక ఈ పెళ్లి వేడుక పేరుతో నిహారిక‌కు భారీగానే కానుక‌లు ముడుతున్నాయ‌న్న‌ది ఓ గుస‌గుస‌.

మెగా అన్న‌య్య‌లు .. అల్లు మావ‌య్య‌లు అంతా ఎవ‌రికి వారు ఖ‌రీదైన కానుక‌ల్ని మెగా ప్రిన్సెస్ కోసం తెచ్చార‌ట‌. ఇక ఈ కానుక‌ల‌న్నిటిలో ఎవ‌రి కానుక హైలైట్? అంటే.. దానికి స‌మాధానం వ‌చ్చేసింది.

మెగాస్టార్ చిరంజీవి నిహారికాకు ఇచ్చిన బహుమతి గురించి వ‌రుస మీడియా క‌థ‌నాలు ఉత్కంఠ పెంచేస్తున్నాయి. గారాల కుమార్తె నిహారిక‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 2 కోట్ల విలువైన వజ్రాల హారాన్ని పెద‌నాన్న చిరంజీవి బహుమతిగా ఇచ్చారు. చిరంజీవి - సురేఖ దంప‌తులు మెహందీ వేళ నిహారికకు బహుమతిని అంద‌జేసారు. అలాగే వ‌రుడు చైత‌న్య‌కు చిరు ఖ‌రీదైన కానుక‌ల్ని అంద‌జేసార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే వివాహ వెన్యూ వ‌ద్ద‌ సంగీత్.. మెహందీ కార్య‌క్ర‌మాలు రంజుగా సాగాయి. నేటి సాయంత్ర‌మే వివాహం కాబ‌ట్టి అందుకు అన్ని ఏర్పాట్లు ద‌గ్గ‌రుండి మెగాస్టార్ చిరంజీవి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. సాయంత్రం 7:15 గంటల ముహూర్తం కావ‌డంతో.. దానికి త‌గ్గ‌ట్టు ప్రిప‌రేష‌న్ సాగుతోంది. పెళ్లి తర్వాత సినిమా రాజకీయ రంగాలకు చెందిన పలువురు ఆహ్వానితులతో హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేశారు. ఇక ఈ పెళ్లికి వంద‌లోపు అతిథులు మాత్ర‌మే ఎటెండ‌వుతున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ్. కోవిడ్ నియ‌మ‌నిబంధ‌న‌ల్ని పాటిస్తూ అత్యంత ప‌క‌డ్భందీగా ప్ర‌తిదీ మెగా కుటుంబం ప్లాన్ చేసింది.