Begin typing your search above and press return to search.
ఆ సినిమాకు 1116/- మాత్రమే అందుకున్న మెగాస్టార్
By: Tupaki Desk | 22 April 2020 8:30 PM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. 150 సినిమాలు పూర్తిచేసుకున్న మెగాస్టార్ సినీ ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ సినీ చరిత్రలోనే కోటి రూపాయల పారితోషికం అందుకున్న తొలి హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. బాలీవుడ్ హీరోలకు కూడా ఇది సాధ్యం కాలేదు. గతంలో ఆపద్భాందవుడు సినిమా కోసం తొలిసారి కోటి రూపాయల పారితోషికం అందుకున్నాడు. ఆ తర్వాత వరసగా తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు చిరు. మిగిలిన హీరోలు కోటి రేంజ్ కు వచ్చేసరికి మెగాస్టార్ రేంజ్ దానికి ఐదింతలు పెరిగిపోయింది. అలాంటి మెగాస్టార్ చిరంజీవి తన తొలి రోజులలో అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడట.
మరి మెగాస్టార్ తన తొలి సినిమాకు చాలా తక్కువ పేమెంట్ తీసుకున్నాడట. అప్పట్లో డబ్బుల కంటే అవకాశం కోసం ఎదురుచూసే వారిలో చిరంజీవి కూడా ఒకరు. అప్పట్లో అవకాశాల కోసం చూసేవాళ్లే కానీ పారితోషికం కాదు. ఎంత ఇచ్చినా కూడా తీసుకోవడం అప్పటి నటులకు అలవాటు. అలాగే చిరంజీవి కూడా తను కెమెరా ముందుకు తొలిసారి వచ్చిన సినిమా పునాది రాళ్లు. అయితే ఆయన నటించిన ప్రాణం ఖరీదు ముందుగా విడుదలైంది. ఈ రెండు సినిమాలకు కూడా చిరంజీవి ఎలాంటి పారితోషికం తీసుకోలేదట. ఇక మూడో సినిమా మనవూరి పాండవులుకు చిరు 1,116 రూపాయల పారితోషికం అందుకున్నాడట. అయితే ఈ సినిమాలో హీరో కృష్ణంరాజు. ఐదుగురు స్నేహితుల బ్యాచ్ లో చిరంజీవి ఒకరుగా నటించారు. ఆ సినిమాకు వెయ్యి నూట పదహార్లు అందుకోగానే మెగాస్టార్ ఆకాశంలో తేలిపోయారట. తొలి సంపాదన తల్లిదండ్రుల చేతుల్లో పెట్టి ఆశీర్వాదాలు అందుకున్నాడట. అలాంటి మెగాస్టార్ ప్రస్తుతం 152వ సినిమాలో బిజీగా ఉన్నారు.