Begin typing your search above and press return to search.

ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం తల‌వంచాల్సిందే

By:  Tupaki Desk   |   31 Aug 2021 9:12 PM IST
ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం తల‌వంచాల్సిందే
X
ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల పుట్టిన‌రోజుల్ని దివంగ‌తులైన ప్ర‌ముఖుల జ‌యంతి వ‌ర్ధంతుల్ని కూడా ఆయ‌న మ‌ర్చిపోకుండా.. ప్ర‌త్యేకించి ట్వీట్ల ద్వారా విషెస్ తెలియ‌జేస్తున్నారు. తాజాగా ఆయ‌న నుంచి ఓ రెండు ట్వీట్లు వైర‌ల్ గా షేర్ అవుతున్నాయి. కెరీర్ ఆరంభం త‌న‌ని డైరెక్ట్ చేసిన‌ దిగ్ధ‌ర్శ‌కుడు బాపుని సంస్మ‌రించిన చిరు.. టోక్యో ఒలింపిక్స్ లో ప‌తకాన్ని సాధించిన పారాలింపియ‌న్ ని ప్ర‌శంసించారు.

``బహుముఖ ప్రజ్ఞాశాలి.. అద్భుత చిత్రకారుడు.. దిగ్దర్శకుడు.. మహోన్నత మనీషి బాపు గారి వర్ధంతి సందర్బంగా ఆ మహానుభావుడిని తలచుకుంటూ .. తెలుగు సంస్కృతి మీద ఆయనది చెరగని ముద్ర. ఆయన గీసిన కార్టూన్ల లో కూడా భాగమవటం నా అదృష్టం..`` అంటూ చిరు కార్టూన్లను షేర్ చేశారు.

మ‌రో ట్వీట్ లో పారాలంపియ‌న్ ల‌కు సెల్యూట్ చేశారు. ``ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచాల్సిందేనని నిరూపించి దివ్యాంగులలో గొప్ప స్పూర్తిని నింపేలా పారాలంపిక్ క్రీడలలో దేశానికి పతకాలు అందించిన విజేతలకు అభినందనలు. ఈ విజయాలు ప్రతి భారతీయుడు గర్వించేవి`` అంటూ మ‌రో ట్వీట్ చేశారు. అవ‌ని లేఖ‌ర‌.. భార‌త‌దేశం త‌ర‌పున తొలి బంగారు ప‌త‌క విజేత‌గా నిల‌వ‌డం గ‌ర్వ‌కార‌ణం అని చిరు ప్ర‌శంసించారు. మెగా ట్వీట్స్ ని అభిమానులు క్లిక్ లు లైక్ ల‌తో వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

మెగాస్టార్ ఓ వైపు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుంటున్నారు. మ‌రోవైపు వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ అభిమానుల‌కు వినోదం లోటు లేకుండా ప్లాన్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియాల్లోనూ త‌న‌దైన హ‌వా సాగిస్తున్నారు. 60 ప్ల‌స్ లోనూ ఆయ‌న ఎంతో జోష్ ని క‌న‌బ‌రుస్తూ యువ‌త‌రానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.