Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కోసం డ్యాన్స్ వీడియో రిలీజ్ చేసిన మెగాస్టార్...!

By:  Tupaki Desk   |   3 May 2020 2:24 PM GMT
ఫ్యాన్స్ కోసం డ్యాన్స్ వీడియో రిలీజ్ చేసిన మెగాస్టార్...!
X
ప్రస్తుతం లాక్ డౌన్ వేళ ఇంటికే పరిమితమైన మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితులపై స్పందించడమే కాకుండా.. తన జ్ఞాపకాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 29న 'అంత‌ర్జాతీయ డ్యాన్స్ దినోత్స‌వం' సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి త‌న‌కి డ్యాన్స్‌ కి త‌న‌కి ఉన్న ప్ర‌త్యేక‌మైన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. డాన్స్ వలన తనకు దక్కిన గౌరవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. డాన్స్ గొప్పతనాన్ని వివరిస్తూ చిరు ఇప్పటికి కూడా తాను ఒత్తిడి ఫీలైన సందర్భాలలో తన రూంలోకి వెళ్లి మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేసి ఉపశయమం పొందుతానని చెప్పారు. డ్యాన్స్ తో తనకు ఉన్న అనుబంధం మీ అందరికీ తెలుసని.. అది మరువలేనిదని.. అదే తనకు కోట్లాది మంది అభిమానులు తెచ్చిపెట్టిందని.. సంగీతం వలె డాన్స్ కూడా ధ్యానంలా ప‌ని చేస్తుందని.. ఎలాంటి మాన‌సిక స్థితిలో ఉన్నా కూడా డ్యాన్స్ మ‌నకి మంచి ఉప‌శ‌మ‌నం ఇస్తుందని.. ఒత్తిడిని త‌గ్గిస్తుంది. ఇలాంటి స‌మ‌యాల‌లో మ‌నమంద‌రం ఒత్తిడిని పోగొట్టుకునేందుకు డాన్స్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని చిరు ఆ రోజు ట్వీట్ చేసారు. అంతేకాకుండా అదే రోజు సాయంత్రం ఆయన తన రీసెంట్ డ్యాన్స్ మూమెంట్ ఒకటి మీతో పంచుకుంటాను అని ఆయన చెప్పడం జరిగింది.

కానీ అదే రోజు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అకస్మాత్తుగా మరణించడంతో చిరు ఆ డాన్స్ వీడియో విడుదల ఆపివేశారు. కాగా నేడు ఆయన సోషల్ మీడియాలో ఓ ఆసక్తిగొలిపే డ్యాన్స్‌ వీడియో పంచుకున్నారు. 80’స్ హీరోయిన్స్ అయిన సుహాసిని, కుష్బూ, రాధా, రాధికా, జయప్రద, లిసా వంటి హీరోయిన్స్ తో ఆయన డాన్స్ చేసిన వీడియో ఆయన పంచుకున్నారు. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతూ లైకులు కొడుతూ రీట్వీట్స్ చేస్తున్నారు. 'బాసూ మీ గ్రేస్ మాత్రం తగ్గట్లేదంటూ' కామెంట్స్ చేస్తున్నారు. 'ఆ గ్రేస్ ఏదైతే ఉందో న భుతో న భవిష్యతి' అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రతి ఏడాది 80స్ క్లబ్ పేరుతో అప్పటి హీరో హీరోయిన్స్ రీయూనియన్ అవుతూ ఉంటారు. ఈ ఏడాది జరిగిన 10వ రీ యూనియన్ లో చిరు డాన్స్ వేసిన వీడియోనే అది. ఈ ఏడాది రీ యూనియన్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రామ్ చరణ్ ఏరాట్లు చేసినట్టుగా అప్పట్లో వెల్లడించారు. ఇప్పుడు ట్విట్టర్ లో షేర్ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది.