Begin typing your search above and press return to search.

అలుపు లేకుండా మెగాస్టార్!!

By:  Tupaki Desk   |   28 Jun 2018 11:36 AM IST
అలుపు లేకుండా మెగాస్టార్!!
X
కమర్షియల్ సినిమాలకు షెడ్యూల్ సెట్ చేస్తే ఒక సమయంలో ఎండ్ అవుతుంది. వాటి కోసం యాక్టర్స్ ఎక్కువగా కాల్షీట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా వరకు అనుకున్న సమయానికి అయిపోతుంది. అయితే కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలకు మాత్రం సమయంపై క్లారిటీ ఉండదు. ఇక చరిత్రాత్మ సినిమాలకు ఎంత ప్లాన్ వేసుకున్నా కూడా షెడ్యూల్స్ అనుకున్న సమయానికి ఎండ్ అవ్వవు. ప్రస్తుతం సైరా చిత్రం యొక్క షూటింగ్ కూడా చాలా నెమ్మదిగా నడుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. అయితే సినిమా షూటింగ్ రాత్రి పగలు లెక్క లేకుండా కంటిన్యూ అవుతోంది. తెల్లవారు జామున 3 గంటల వరకు కూడా మెగాస్టార్ అలుపు లేకుండా సీన్లలో ఎనర్జిటిక్ గా పాల్గొంటున్నారు. ఆరు పదుల వయసులో కూడా నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్నారు అంటే ఆయన గురించి ఎంత పొగిడిన తక్కువే. ఈ సినిమా మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్ లోని పరిసర ప్రాంతంలో వేసిన ఒక భారీ సెట్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 50 మందికి పైగా బ్రిటిష్ పాలకులతో యుద్ధం చేసే సన్నివేశాలు సినిమాలో హైలెట్ కానుందట. యూకే నుంచి కొంతమంది తెల్లవారిని షూటింగ్ కోసం రప్పించారు. కేవలం యాక్షన్ సీన్స్ కోసమే దాదాపు 40 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ తన హోమ్ ప్రొడక్షన్ లో ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.