Begin typing your search above and press return to search.
బాహుబలిని ఆకాశానికెత్తేసిన చిరు
By: Tupaki Desk | 20 July 2015 4:34 PM ISTబాహుబలి.. తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి టాలీవుడ్లో ఏ ఒక్కరూ మొహమాట పడలేదు. ఇప్పటికీ ఈ సినిమా గురించి పరిశ్రమలోని ప్రముఖులందరూ గొప్పగా మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి సైతం సినిమా విడుదలైన మొదట్లో స్పందించారు. ఐతే అప్పటికి ఆయన బాహుబలి చూసినట్లు లేరు. ఐతే ఆ తర్వాత ఎప్పుడు చూశారో కానీ.. ఆ సినిమా గురించి మాట్లాడ్డానికి అవకాశం రాగానే ఏమాత్రం మొహమాట పడకుండా ‘బాహుబలి’పై ప్రశంసల వర్షం కురిపించారు. టీఎస్సార్ జాతీయ అవార్డుల కార్యక్రమం వేదికపై బాలయ్యకు అవార్డు అందిస్తూ బాహుబలి గురించి గొప్పగా చెప్పాడు చిరు.
‘‘భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యధిక సినిమాలు తీసే రికార్డున్న తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజున అంతర్జాతీయ ఖ్యాతి పొందుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు దీటుగా సినిమాలు వస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ బాహుబలి. సినిమా చూస్తుంటే ఆద్యంతం అత్యద్భుతంగా ఉంది. ఎంతో ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమా తీశారు. అంతర్జాతీయంగా ఏ సినిమా తీసుకున్నా.. 300 తీసుకున్నా.. ట్రాయ్ తీసుకున్నా.. వార్ సినిమా అయినా.. హిస్టారికల్ ఫిలిం అయినా.. వాటన్నంటికీ దీటుగా మన డైరెక్టర్ రాజమౌళి, తెలుగువాడు తీశాడు అద్భుతమైన సినిమా. ఇది నిజంగా అత్యద్భుతం’’ అని చిరు అన్నాడు.