Begin typing your search above and press return to search.

‘చిరంజీవి పొన్నియన్‌ సెల్వన్’‌.. ఓ వెబ్ సిరీస్!

By:  Tupaki Desk   |   15 Jan 2021 6:30 AM GMT
‘చిరంజీవి పొన్నియన్‌ సెల్వన్’‌.. ఓ వెబ్ సిరీస్!
X
తమిళంలో ఎంతో ఫేమస్ అయిన నవల 'పొన్నియన్‌ సెల్వన్‌'. ఈ నావెల్ ను సినిమాగా మలుస్తున్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. భారీ తారాగణంతో తెరకెక్కుతోందీ చిత్రం. చియాన్ విక్రమ్‌, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, ప్రకాశ్‌ రాజ్‌ ఇలా.. అగ్ర తారలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు.

అయితే.. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే ఇదే నవల వెబ్‌ సిరీస్‌ రూపంలో తెరకెక్కిస్తుండడం విశేషం. ఈ వెబ్‌ సిరీస్‌కు 'చిరంజీవి పొన్నియన్‌ సెల్వన్‌' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ వెబ్‌ సిరీస్‌కు అజయ్ ప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌లో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఏప్రిల్ 14న వెల్లడిస్తామని చెప్పారు దర్శకుడు అజయ్‌.

ఆగస్ట్‌ 18 నుంచి హైదరాబాద్‌, మైసూర్‌, కేరళ, శ్రీలంక ప్రాంతాల్లో చిత్రీకరణ మొదలు పెడతామని చెప్పారు డైరెక్టర్. 2022 ఏప్రిల్‌ 14న తొలి ఎపిసోడ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ప్రకటించారు.