Begin typing your search above and press return to search.
చిరు 152 ఇంపార్టెంట్ లీక్స్?
By: Tupaki Desk | 1 Aug 2019 1:14 PM ISTఇంకా షూటింగ్ ప్రారంభం కాకుండా మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న చిత్రం సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నారన్న టాక్ చాలా రోజుల క్రితమే వచ్చింది కానీ అందులో ఓ పాత్ర నక్సలైట్ తరహాలో ఉంటుందన్న వార్త ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. ఇది యూనిట్ అఫీషియల్ గా చెప్పింది కాదు కానీ ఇవాళ ఓ ప్రముఖ దినపత్రికలో సైతం ఈ వార్త రావడంతో హాట్ టాపిక్ గా మారింది.
ఒక పాత్ర మధ్యవయస్కుడిగా కాస్త నెరిసిన జుట్టు గెడ్డంతో ఉంటే మరో పాత్ర యధావిధిగా యంగ్ లుక్స్ తో ఉంటుందని వినికిడి. ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం చిరుకి కొత్తేమి కాదు కానీ చాలా ఏళ్ళ తర్వాత స్క్రీన్ పై ఇలా చూసే అభిమానుల ఉత్సాహం మాములుగా ఉంటుందా. ప్రస్తుతం కొరటాల శివ స్క్రిప్ట్ ని పూర్తి చేసి టీమ్ ని సెట్ చేసుకునే పనిలో పడ్డాడు. హీరోయిన్లు ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.టెక్నీషియన్లు దాదాపు ఓకే అయ్యారని సమాచారం.
సైరా ప్రమోషన్ మొదలుపెట్టాక కానీ దీని గురించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. తన 152 కోసమే ఫిజికల్ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టిన చిరు అప్పుడే తనలో వస్తున్న మార్పులు జనం గుర్తుపట్టేస్తున్నారు. కాస్త సన్నబడిన ఛాయలు కూడా ఉన్నాయి. అప్పుడెప్పుడో రక్త సిందూరం-సింహపురి సింహంలో చిరు నక్సలైట్ తరహా పాత్రలు వేశారు. మళ్ళి మూడు దశాబ్దాల తర్వాత అంటే విశేషమేగా