Begin typing your search above and press return to search.

జపం జపం జపం.. చిరు జపం

By:  Tupaki Desk   |   7 April 2016 4:00 AM IST
జపం జపం జపం.. చిరు జపం
X
మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్ లోకి వెళ్లినప్పటి నుంచి సినిమా ఫంక్షన్లకు అటెండ్ కావడం బొత్తిగా తగ్గించేశారు. తన ఫ్యామిలీ ఫంక్షన్లలో కూడా అరుదుగానే కనిపించేవారు చిరు. కానీ మెగాస్టార్ ఎప్పుడైతే తన రీఎంట్రీని కన్ఫాం చేశారో.. అప్పటి నుంచి తరచుగా సినిమా ఈవెంట్లకు హాజరవుతున్నారు.

బ్రూస్ లీతో మొదలుపెట్టి వరుసగా మెగా ఈవెంట్స్ అన్నింటిలోనూ మెగాస్టార్ కు ప్రముఖంగా ప్రచారం సాగుతోంది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో టైంలో అయితే.. ఇది పీక్స్ కి వెళ్లిపోయిందని చెప్పాలి. అలాగే చిరంజీవి కూతురు శ్రీజ పెళ్లి, రిసెప్షన్ ఫంక్షన్లకు కూడా వాళ్లే స్పెషల్ గా ఫోటోలు, వీడియోలు తీసేసి ఇచ్చేశారు. ఇప్పుడు ఏప్రిల్ 10న విశాఖలో జరగనున్న సరైనోడు ఆడియో సక్సెస్ ప్రోగ్రాంకి కూడా చిరునే మెయిన్ గెస్ట్.

చిరు రీఎంట్రీ పవర్ ఫుల్ గా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చిరు 150 ఫెయిల్ కాకూడదనే టార్గెట్ తో.. ప్రతీ విషయంలోనూ చిరంజీవికి ఫుల్లు హైప్ ఇచ్చేలా ప్లాన్ చేశారని అంటున్నారు. అందుకే మెగా అనే ప్రతీ మాట ఉన్నప్పుడల్లా చిరంజీవినే ఫోకస్ చేసేస్తున్నారని తెలుస్తోంది. ఇదంతా 2019 ఎలక్షన్స్ నాటికి చిరంజీవికి ఉపయోగపడతుందనే టాక్ కూడా ఉంది.