Begin typing your search above and press return to search.

150వ సినిమానా? 151వ సినిమానా?

By:  Tupaki Desk   |   24 Jun 2015 11:00 PM IST
150వ సినిమానా? 151వ సినిమానా?
X
మెగాస్టార్‌ చిరంజీవి నటించే 150వ సినిమా ఇప్పటికీ ఓ సస్పెన్స్‌. అసలు ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ ఇంతవరకూ లేనేలేదు. ప్రెస్‌ ముందుకు వచ్చి ఏ విషయాన్ని ప్రకటించిందే లేదు. కేవలం పూరి జగన్నాథ్‌ ట్వీట్ల ద్వారానే ఇదీ అదీ అని చెప్పుకుంటున్నారంతే.

పూరీ స్వయంగా నేనే 150వ సినిమాకి దర్శకుడిని అని ప్రకటించుకున్నాడు. తరువాత చరణ్‌ కన్‌ఫామ్‌ చేశాడులే. ఇప్పటికే ఇంటర్వెల్‌ వరకూ కథ రెడీ అయ్యింది. చిరుకి వినిపించాను. అద్భుతంగా ఉందని ప్రశంసించారని పూరీ మొన్ననే చెప్పాడు. అయితే ఈలోగానే వినాయక్‌ చిరుని కలవడం పెద్ద చర్చనీయాంశమైంది. పూరీ ఔట్‌, వినాయక్‌ ఇన్‌ అంటూ ప్రచారం సాగుతోంది. ఈ టోటల్‌ ఎపిసోడ్‌లో చిరుతో వినాయక్‌ మీటింగ్‌ సారాంశం ఏమిటి? అన్నది ఎవరికీ తెలియని అతిపెద్ద సీక్రెట్‌. అయితే పూరీ ల్యాండ్‌ మార్క్‌ సినిమాకి దర్శకత్వం వహించినా 151వ సినిమాకి సంబంధించిన కథ వినాల్సి ఉంది కాబట్టి వినయ్‌ మెగాస్టార్‌ని కలిశారని కొందరు చెబుతున్నారు.

ఇప్పటికే చిన్నికృష్ణ మెగాస్టార్‌కి సరిపడే కథాంశాన్ని తయారు చేస్తున్నారట. ఠాగూర్‌ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని ఇచ్చాడు వినాయక్‌. ఇంద్ర లాంటి రికార్డ్‌ హిట్‌కి కథ అందించాడు చిన్నికృష్ణ. ఈ కలయికలోనే చిరు నటించే 151వ సినిమాకి కథ పుడుతోందంటూ ఫిలింనగర్‌లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? అనేది తెలియాలంటే చిరునే స్వయంగా నోరు విప్పాలి.