Begin typing your search above and press return to search.

బాహుబలిని అప్పుడే డిసైడ్‌ చేయొద్దు -చిరు

By:  Tupaki Desk   |   11 July 2015 10:25 PM IST
బాహుబలిని అప్పుడే డిసైడ్‌ చేయొద్దు -చిరు
X
శతాధిక చిత్రాల హీరో మెగాస్టాఆర్‌ చిరంజీవి. 150వ సినిమా చేయడానికి రెడీ అవుతున్న వేళ ఇది. అంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ హీరోని ఏదైనా ప్రశ్నించే ముందు ఎంతో ఆలోచించుకోవాలి. గొప్ప కోసం ప్రశ్నిస్తే తోలుతీసే సమాధానం అట్నుంచి వస్తుందన్న సెన్స్‌ పనిచేయాలి. కానీ ఒ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకి చిరు నిజంగానే దిమ్మ తిరిగే సమాధానం చెప్పారు.

'నిన్న రిలీజైన బాహుబలికి డివైడ్‌ టాక్‌ వచ్చింది. బాహుబలి కంటే మగధీర బెటర్‌ అని అంటున్నారు..' అన్న ప్రశ్నకు చిరు నుంచి వచ్చిన స్పందన అనూహ్యం. అప్పుడే ఆ సినిమా గురించి మాట్లాడడం చాలా ఎర్లీ అవుతుంది. కొద్దిరోజులు వేచి చూడాల్సిందేనని అన్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కి వెళ్లి చూసిన వారు చాలా పాజిటివ్‌గా చెబుతున్నారని బాహుబలికి తన వంతు సాయం అందించారు చిరు. నిజంగానే అంచనాలు లేకుండా చూస్తేనే ఏ సినిమా అయినా కిక్‌ ఇచ్చేది మరి.

చరణ్‌ ట్రూజెట్‌ ఆవిష్కరణ విజిటింగు కోసం తిరుపతి వెళ్లిన చిరుకి ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. అప్పటికప్పుడు చిరు స్పందించిన తీరు అమోఘం. వాస్తవానికి మెగాస్టార్‌ నటించిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ జగదేక వీరుడు-అతిలోక సుందరికి తొలిరోజు టాక్‌ జీరో. వారం తర్వాత పికప్‌ అయ్యింది. తరువాత ఇండస్ట్రీ హిట్‌ అయ్యింది. ఆ అనుభవాన్ని ఇప్పుడిలా మాటల రూపంలో బైటికి చెప్పారన్నమాట.