Begin typing your search above and press return to search.
150తో ఆగట్లేదు.. కౌంటింగ్ స్టార్ట్
By: Tupaki Desk | 26 Jun 2016 11:37 AM ISTఅప్పట్లో ఒక రూమర్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాతో ఇక ఆపేస్తారని.. ఇదే ఆయన ఆఖరి సినిమా అని.. ఆ తరువాత ఇక సినిమాలు చేయరని. దానికి తగ్గట్లే మెగాస్టార్ కూడా చాలా కథలను ఎంచుకుని ఎంచుకుని.. చివరకు 2 సంవత్సరాల తరువాత ఆయన 'కత్తి' రీమేక్ ను ఎంచుకున్నారు. అందుకే ఆయన తదుపరి సినిమాలను చేస్తారా చేయరా అనే సందేహం వచ్చేస్తోంది మరి.
ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవిని అడిగితే.. ''ఎందుకు చేయను! అవకాశం ఉన్నంత వరకు చేస్తా. 150 చేశాక... 151... 152... ఇలా చేసుకుంటూ వెళ్ళడానికి అడ్డంకులు - అభ్యంతరాలు ఏముంటాయి!'' అంటూ చెప్పుకొచ్చారు. అంటే పూరి జగన్ వంటి దర్శకుల కోరిక తీరబోతోంది అనమాట. మెగాస్టార్ తో 150 కుదరకపోతే కనుక ఆ తరువాత 151 కాని 163 సినిమా కాని చేస్తానని పూరి చెప్పుకొచ్చాడు. చూస్తుంటే ఇప్పుడు చిరంజీవి కౌంటింగ్ మొదలెట్టేసి ఇక రచ్చ లేపేసే టైపులో ఉన్నారే.
మరి రాజకీయాలనూ.. షూటింగులను బ్యాలెన్స్ చేస్తారా అంటే.. ''ఒక పక్కన షూటింగ్ చేస్తూనే.. మరో ప్రక్కన రాజకీయ నాయకుడిగా మా పార్టీకీ - ప్రజలకూ సేవ చేస్తా'' అంటున్నారు చిరంజీవి. అయితే బాస్ ఈజ్ బ్యాక్ అనమంటారా.. అంటే.. ''యస్... అయామ్ బ్యాక్'' అంటూ నవ్వేశారు.
