Begin typing your search above and press return to search.

మెగా ఈవెంటుకు చిరు హ్యాండిస్తున్నారా??

By:  Tupaki Desk   |   22 Aug 2016 9:28 AM GMT
మెగా ఈవెంటుకు చిరు హ్యాండిస్తున్నారా??
X
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 61వ బర్త్ డే సందర్భంగా.. ఆయన 150వ సినిమా తాలూకు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏదో ట్విట్టర్ లో పోస్టర్ ను రిలీజ్ చేసేసి.. దానితో సరిపెట్టేయకుండా.. ఏకంగా యంగ్ మెగా హీరోల చేతుల మీదుగా సాయంత్రం శిల్పా కళా వేదికలో ఒక వేడుకను ప్లాన్ చేశాడు ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్‌. ఇప్పటికే ఈ ఈవెంట్ ఇన్వయిట్ పోస్టర్ మీద పవన్‌ కళ్యాణ్‌ - నాగబాబు ఫోటోలు లేకపోవడంతో మెగా అభిమానులు షాక్ తిన్నారు. ఇప్పుడు మరో షాక్ తినేలా ఉన్నారు.

నిజానికి తన ప్రతీ పుట్టినరోజునూ ఎక్కడో దూరంగా ఉన్న దేవాలయాల్లో జరుపుకుంటుంటారు చిరంజీవి. మొన్న 60వ పుట్టినరోజు నాడు మాత్రమే అలా సెవెన్ స్టార్ హోటల్ లో భారీ పార్టీ ఇచ్చారులే. అయితే ఈ సంవత్సరం కూడా చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలసి అలాగే సీక్రెట్ లొకేషన్ కు వెళిపోయారు. కాని రామ్ చరణ్‌ మాత్రం ఈరోజు ఉదయం ఫిలిం నగర్ దైవసన్నిధానంలో ప్రత్యేక పూజలు జరిపారు. అయితే ఈరోజు సాయంత్రం జరిగే మెగా 150 మోషన్ పోస్టర్ లాంచింగ్ వేడుకకు.. చరణ్‌ - బన్నీ - వరుణ్‌ తేజ్ - సాయిధరమ్ - శిరీష్‌ లు తప్పించి.. అసలు మెగా బ్రదర్స్ మాత్రం రారంటూ ఇప్పటికే రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో అభిమానులు అవాక్కవుతున్నారు మరి.

తన సినిమా మోషన్ పోస్టర్ లాంచింగ్ ఈవెంటుకు తానే రావట్లేదంటే అది నిజంగానే మెగాస్టార్ అభిమానులకు చేదు వార్త. అయితే ఈ సినిమాను అన్ని విధాలుగా స్పెషల్ గా ఫీలవుతున్న చరణ్‌.. ఈరోజు ఈవెంట్ ను యంగ్ జనరేషన్ మెగా హీరోలతో కలసి తాను ఒక కొత్త బాధ్యత తీసుకుంటున్నవేళ జరుపుతున్న సంబరం కాబట్టి.. దీనికి మెగా బ్రదర్స్ అక్కర్లేదని ఫీలయ్యాడంటారా? చూడాలి మరి.