Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ తర్వాత మెగాస్టార్‌ దే మొదటి ప్రారంభోత్సవం

By:  Tupaki Desk   |   15 Oct 2020 1:30 PM IST
లాక్‌ డౌన్‌ తర్వాత మెగాస్టార్‌ దే మొదటి ప్రారంభోత్సవం
X
ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా కారణంగా కొత్త సినిమాలు ఏమీ ప్రారంభం కాలేదు. జనవరి ఫిబ్రవరిలో పెద్ద సినిమాలు ఏమీ కూడా ప్రారంభం అవ్వలేదు. మార్చి నుండి కరోనా వల్ల లాక్‌ డౌన్‌ విధించడం వల్ల ప్రారంభం అయిన సినిమాలు కూడా షూటింగ్‌ జరుపుకోలేదు. గత నెల నుండి మెల్లగా స్టార్స్‌ సెట్స్‌ పైకి వెళ్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు మాత్రం ఇంకా ప్రారంభం అవ్వలేదు. ఎట్టకేలకు ఈ నెలలో మెగాస్టార్‌ చిరంజీవి కొత్త సినిమాకు క్లాప్‌ కొట్టబోతున్నారు. లాక్‌ డౌన్‌ తర్వాత ప్రారంభం కాబోతున్న మొదటి సినిమా చిరంజీవిదే అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న చిరంజీవి ఆ వెంటనే మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో 'వేదాళం' సినిమా రీమేక్‌ లో నటించబోతున్నాడు. ఆ సినిమాను అనీల్‌ సుంకర నిర్మించబోతున్నాడు. సాయి పల్లవి ఈ రీమేక్‌ లో చిరుకు చెల్లి పాత్రలో కనిపించబోతుంది. ఆచార్య షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే వేదాళం రీమేక్‌ షూటింగ్‌ ప్రారంభం అవ్వబోతుంది. అందుకు గాను ఈనెల 20వ తారీకున మంచి ముహూర్తం సందర్బంగా వేదాళం రీమేక్‌ షూటింగ్‌ ను ప్రారంభించాలని భావిస్తున్నారు.

సినీ ప్రముఖులు కొందరి సమక్షంలో ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించబోతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించే అవకాశం ఉంది. ఆచార్య విడుదలైన రెండు మూడు నెలల్లోనే ఈ రీమేక్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలు కాకుండా లూసీఫర్‌ రీమేక్‌ లో కూడా చిరంజీవి నటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ రీమేక్‌ కు వివి వినాయక్‌ దర్శకత్వం వహించబోతున్నాడు అంటున్నారు. ఆ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.