Begin typing your search above and press return to search.

పవన్ కి చిరు చెప్పింది అదేనా?

By:  Tupaki Desk   |   22 March 2016 4:00 AM IST
పవన్ కి చిరు చెప్పింది అదేనా?
X
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి చాలానే కబుర్లు చెప్పారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ తో అనుబంధం గురించి మాట్లాడ్డమే కాదు.. సినిమాలు మానేస్తానన్న పవర్ స్టార్ మాటలను తప్పు బట్టారు కూడా. నువ్వు రెండు గుర్రాల మీద స్వారీ చేయగల సత్తా ఉన్నవాడివి అంటూనే చిరు చెప్పిన మాటలు వింటే.. అంతర్లీనంగా ఓ విషయం అర్ధమవుతుంది.

'సినిమాలు మానేస్తానని అనద్దు. అది కరెక్ట్ కాదు. నువ్వు రెండింటినీ నడిపించగల స్టామినా ఉన్నవాడివి. ఇంతమంది అభిమానుల కోసమైనా సినిమాలు చేయాలి. నువ్వు ఎంచుకున్న దారిలో నువ్వు వెళ్లినా సినిమాలు చేయి. మేమంతా నీ వెనక ఉన్నాం' అన్నారు చిరంజీవి. అంటే.. పవన్ ప్రతీ అడుగు వెనకా తన సపోర్ట్ ఉంటుందని చెప్పకనే చెప్పారు మెగాస్టార్. సినిమాలు వదిలేసి కేవలం పాలిటిక్స్ లో మాత్రమే ఉండాలని చిరంజీవి తీసుకున్న నిర్ణయం కొంత బెడిసికొట్టిన విషయం మనకు తెలిసిందే.

అందుకే పవన్ ని సినిమాలు కూడా చేయమని చిరు సలహా ఇచ్చారని అనిపిస్తుంది కానీ.. దీని వెనక మరో అర్ధం కూడా వినిపిస్తుంది. పవన్ ఎంచుకున్న దారి అంటే.. జనసేనకు కూడా తన మద్దతు ఉంటుందని చిరంజీవి హింట్ ఇచ్చేసినట్లే అనిపిస్తోంది. మరి దీనిపై క్లారిటీ అయితే మాత్రం 2019లోనే వస్తుంది. అప్పటివరకూ వెయిట్ చేయక తప్పదు.