Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: స్టైల్ ని రఫ్ఫాడిస్తున్న మెగాస్టార్
By: Tupaki Desk | 7 Oct 2018 11:06 AM GMTమెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి అడుగుపెట్టినందువల్ల ఫ్యాన్ బేస్ దెబ్బతిన్నట్టు అనిపించినా.. రీ-ఎంట్రీ తో మాత్రం అందరూ బాస్ ఈజ్ బ్యాక్ అని సెలబ్రేట్ చేసుకున్నారు. 'ఖైది నెంబర్ 150' కలెక్షన్స్ చూసిన తర్వాత అభిమానులు గానీ సాధారణ ప్రేక్షకులు గానీ మెగాస్టార్ ప్లేస్ కు అలాగే గౌరవం ఇచ్చారని అర్థం అయిపోయింది. పొలిటికల్ జర్నీ ఎఫెక్ట్ చిరంజీవి హీరో ఇమేజ్ మీద పడలేదని కూడా అర్థం అయింది.
ఇక బాసు రెట్టించిన ఉత్సాహంతో 'సైరా' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ పీరియడ్ ఫిలిం షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. జార్జియాకు వెళ్తున్నప్పుడు తీసిన చిరంజీవి పిక్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. రెండు జేబులుండే బ్లాక్ కలర్ డెనిమ్ షర్టు.. ఫేడెడ్ బ్లూ జీన్స్ లో బాసు మెగా స్టైలిష్ గా కన్పిస్తున్నాడు. ఇక వాటికి తోడుగా ఒక భుజానికి తగిలించుకున్న బ్యాగ్ ఒకటి స్టైల్ ను మరింతగా పెంచింది.
ఈ ఫోటోలో మెగాస్టార్ ను చూసి అరవై ఏళ్ళు అంటే ఎవరూ నమ్మలేరు. ఒకవేళ కాదు బాసుకు అరవై దాటింది ఎవరైనా అంటే వాడి నెత్తిన గట్టిగా రెండు మొట్టికాయలు వేయండి. వాసన్ ఐ క్లీనిక్కో లేకపోతే మరో ఆఫ్తాల్మాలజిస్ట్ దగ్గరకో వెళ్లి పెద్ద ఫాంట్ A నుండి చిన్న ఫాంట్ z వరకూ చదివి కళ్ళ పరిక్ష చేసుకోమని చెప్పండి. ఏదేమైనా బాస్ ఈజ్ బ్యాక్.. స్టైల్ తో రఫ్ఫాడిస్తున్నాడంతే.