Begin typing your search above and press return to search.

అప్పుడే 50 శాతం ఫినిష్!!

By:  Tupaki Desk   |   23 Aug 2016 5:08 AM GMT
అప్పుడే 50 శాతం ఫినిష్!!
X
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా.. మెగా 150కి సంబంధించిన బోలెడన్ని సంగతులు బయటకొస్తున్నాయి. ఫస్ట్ లుక్ వచ్చింది.. టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ లో కూడా అన్నయ్య సరిగా కనిపించలేదని ఫీలయ్యే వాళ్లకోసం.. రెండో లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ మెగా 150కి.. ఖైదీ నెంబర్ 150 టైటిల్ ని సెట్ చేయడం వెనక.. ఖైదీ.. ఖైదీ నెంబర్ 786 లు సాధించిన భారీ విజయాల సెంటిమెంట్ ఉందంటున్నారు.

అయితే.. ఇప్పుడీ సినిమాకి సంబంధించిన ఓ లేటెస్ట్ అండ్ హాటెస్ట్ అప్డేట్ బయటకొచ్చింది. 'ఖైదీ నెంబర్ 150'ని దర్శకుడు వివి వినాయక్ సూపర్ ఫాస్ట్ గా పిక్చరైజ్ చేసేస్తున్నాడని చాలా సార్లే చెప్పేసుకున్నాం. కానీ ఈ స్పీడ్ అందరి అంచనాలను మించిపోయిందట. ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసేశారంటే.. ఆశ్చర్యం వేయక మానదు. అసలు షూటింగ్ స్టార్ట్ చేసిందే జూన్ చివరి వారంలో. అంటే ఇప్పటికి ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. ఈ లోపే సగానికి సగం తీసేయడమంటే.. ఏ స్పీడ్ లో సినిమా తీస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

అయితే.. ప్రతీదానికి ఈకలు పీకే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా. అసలు హీరోయిన్ సెలక్షన్ కూడా కాకుండా సగం షూటింగ్ అయిపోవడమేంటి అని జోకులు వేస్తున్నారు. అసలు విషయం అదే మరి.. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ అంత పేద్దగా ఉంటుంది. అయినా చిరు డ్యుయల్ రోల్ చేశాక.. ఇక మిగతావాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ ఏ మాత్రం ఉంటుందో ఊహించేసుకోవచ్చు కదా!