Begin typing your search above and press return to search.
మెగాస్టార్ ఆ మాస్ డైరెక్టర్ కి హ్యాట్రిక్ ఛాన్స్ ఇస్తున్నాడా...?
By: Tupaki Desk | 28 July 2020 1:00 PM ISTటాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు వీవీ వినాయక్. ఇండస్ట్రీలోని అగ్రహీరోలందరితోనూ సినిమాలను తెరకెక్కించిన దర్శకులలో వినాయక్ ఒకరు. 'ఆది' 'దిల్' 'లక్ష్మి' 'చెన్నకేశవరెడ్డి' 'ఠాగూర్' 'కృష్ణ' 'అదుర్స్' 'నాయక్' 'ఖైదీ నెం.150' వంటి ఎన్నో హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. కమర్షియల్ దర్శకుడిగా ఒకప్పుడు వరుస విజయాలు సాధించన వీవీ వినాయక్ ఇటీవల కాలంలో ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం 'ఇంటెలిజెంట్' సినిమాని రూపొందించిన వినాయక్ ఆ తర్వాత మరో సినిమా పట్టాలెక్కించలేకపోయాడు. అయితే నటుడిగా మారి దిల్ రాజు బ్యానర్ లో 'శీనయ్య' అనే సినిమా స్టార్ట్ చేసారు. కాగా వీవీ వినాయక్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
కాగా మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్' సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించనున్నాడు. ఇక ఈ రీమేక్ కు 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడని.. ఇప్పటికే సుజీత్ మన నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సుజీత్ ని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు ఫిలిం సర్కిల్స్ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. 'లూసిఫర్' స్క్రిప్ట్ లో సుజీత్ చేసిన ఛేంజెస్ మెగాస్టార్ కి నచ్చలేదట. అందుకే ఈ ప్రాజెక్ట్ ని మరో అనుభవజ్ఞుడైన డైరెక్టర్ చేతిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడట.
ఈ నేపథ్యంలో మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ కి ఈ స్క్రిప్ట్ భాద్యతలు అప్పగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో చిరంజీవితో వీవీ వినాయక్ తీసిన రెండు రీమేక్ సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. 'రమణ' అనే తమిళ్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన 'ఠాగూర్'.. 'కత్తి' సినిమాకి రీమేక్ గా వచ్చిన 'ఖైదీ నెం.150' సూపర్ సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలో 'లూసిఫర్' రీమేక్ కూడా వీవీ వినాయక్ అయితే బాగా హ్యాండిల్ చేస్తాడని చిరు భావిస్తున్నారట. మరి చిరంజీవి - వినాయక్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కనుందనే వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.