Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : వీరయ్య లుక్ తో ఫ్యాన్స్ లో పూనకాలు లోడింగ్‌

By:  Tupaki Desk   |   1 Jan 2023 1:19 PM GMT
పిక్ టాక్ : వీరయ్య లుక్ తో ఫ్యాన్స్ లో పూనకాలు లోడింగ్‌
X
మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య సంక్రాంతికి విడుదల కాబోతుంది. తాజాగా విడుదల అయిన పూనకాలు లోడింగ్‌ పాట తెగ ట్రెండ్‌ అవుతోంది. రవితేజ మరియు చిరంజీవి కలిసి రచ్చ చేసిన ఆ పాట యూట్యూబ్‌ లో కూడా రచ్చ చేస్తూ సోషల్‌ మీడియాలో టాప్ లో ట్రెండ్‌ అవుతూ కొత్త సంవత్సరంను మెగా ఫ్యాన్స్ ఫుల్‌ గా ఎంజాయ్ చేసేలా చేసింది.

ఇక వాల్తేరు వీరయ్య నుండి కొత్త సంవత్సరం కానుకగా ఈ పోస్టర్‌ వచ్చింది. పోస్టర్‌ లో చిరంజీవిని చూస్తూ ఉంటే ఇరవై ఏళ్ల క్రితం ఆయన సినిమాల్లో ఆయనను చూసినట్లుగానే ఉంది అంటూ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. పోస్టర్స్ లో చిరంజీవి వయసు ఇరువై నుండి ముప్పై ఏళ్లు తగ్గినట్లుగా అనిపిస్తుందని మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆకట్టుకునే వాల్తేరు వీరయ్య యొక్క పాటలకు తోడు ఇప్పుడు ఈ పోస్టర్ అంతకు మించి అన్నట్లుగా ఉంది. చిరంజీవి ని వీరయ్య గా ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపించే విధంగా ఈ స్టిల్‌ ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ మురిసి పోతున్నారు. ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ పోస్టర్ తో సినిమా స్థాయి మరింతగా పెరిగింది.

చిరంజీవి గడ్డం.. కళ్లద్దాలు.. ఆ కాస్ట్యూమ్స్ అన్నీ భలే సెట్‌ అయ్యాయి. దానికి తోడు చాలా స్టైలిష్ ఫోజ్ కూడా అవ్వడంతో ఈ ఫొటోను అభిమానులు తెగ లైక్‌ చేస్తున్నారు. సినిమాలో కూడా ఇదే రేంజ్‌ లో చిరు లుక్ ఉండి.. కాస్త కథలో కంటెంట్‌ ఉండి కథనంలో ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్ ఉంటే వందల కోట్ల కలెక్షన్స్ వాల్తేరు వీరయ్యకు లోడింగ్‌ అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాబీ దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. శృతి హాసన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. రవితేజ కూడా ఈ సినిమాలో నటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.