Begin typing your search above and press return to search.

చిరంజీవి సెటైర్లు వేసింది ఎవ‌రి మీద?

By:  Tupaki Desk   |   25 July 2022 5:56 AM GMT
చిరంజీవి సెటైర్లు వేసింది ఎవ‌రి మీద?
X
మెగాస్టార్ చిరంజీవి ఎవ‌రిపై సెటైర్లు వేయ‌రు కానీ తాజాగా మాత్రం కొంత మంది డైరెక్ట‌ర్ల‌పై సెటైర్లు వేయ‌డం ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. కొంత మంది ద‌ర్శ‌కులు షూటింగ్ లొకేష‌న్ లోనే అప్ప‌టిక‌ప్పుడు డైలాగ్ లు రాసి వ‌డ్డిస్తున్నార‌ని మెగాస్టార్ చిరంజీవి తాజాగా కామెంట్ లు చేస‌య‌డం ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చ‌ద్దా'. నాగ‌చైత‌న్య కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించిన ఈ మూవీ తెలుగులోనూ విడుద‌ల కాబోతోంది.

తెలుగులో ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సినిమా ఆగ‌స్ట‌లు 11న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ని స్టార్ట్ చేశారు. హైద‌రాబాద్ లో ఆదివారం రాత్రి ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో అమీర్ ఖాన్, నాగ‌చైతన్య పాల్గొన‌గా ఈ మూవీకి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుల తీరుపై ప‌రోక్షంగా సెటైర్లు వేశారు.

అమీర్‌ఖాన్ ల‌గాన్‌, దంగ‌ల్‌, లాల్ సింగ్ చ‌ద్దా వంటి సినిమాలు తీసి రిస్క్ చేయ‌డంతో త‌న‌కు తానే సాటి అనిపించుకున్నారు. కానీ నేను అమీర్ లా కాకుండా సేఫ్ గేమ్ ఆడ‌టానికే ఇష్ట‌ప‌డ్డాను. మినిమ‌మ్ గ్యారెంటీ సినిమాలే చేస్తున్నాను. అభిమానుల‌ని సంతోష పెట్టే సినిమాలు మాత్ర‌మే చేశాను.

అయితే కొన్ని సార్లు నాకు తెలియ‌కుండానే క‌నిపించ‌ని కార‌ణాల వ‌ల్ల త‌ప్పులు జ‌రుగుతుంది' అంటూ 'ఆచార్య‌' ఫెయిల్యూర్ ని ఇండైరెక్ట్ గా వెల్ల‌డించే ప్ర‌య‌త్నం చేశారు.

చిరు చెప్పిన మాట‌ల‌ని బ‌ట్టి ద‌ర్శ‌కుడు కొర‌టాల చేసిన త‌ప్పిదాల వ‌ల్లే 'ఆచార్య‌' ఫ్లాప్ అయింద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇదిలా వుంటే చిరు కొంత మంది ద‌ర్శ‌కుల‌పై డైరెక్ట్ గానే సెటైర్లు వేయ‌డం ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ద‌ర్శ‌కులు సెట్ లోనే ల‌ప్ప‌టిక‌ప్పుడు డైలాగ్ లు రాసి వడ్డిస్తున్నార‌ని, ఇది న‌టుల‌కు ఇబ్బందిగా మారుతోంద‌న్నారు. డైలాగ్ లు నేర్చుకోవాలా? లేక న‌ట‌న‌పై దృష్టిపెట్టాలా? అంటూ అస‌హ‌పం వ్య‌క్తం చేశారు.

దీంతో మెగాస్టార్ చిరు కి సంబంధించిన ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఆయ‌న‌ వేసిన సెటైర్లు ఎవ‌రి మీద అంటూ నెట్టింట కామెంట్ లు వినిపిస్తున్నాయి. 'ఆచార్య‌' ఫెయిల్యూర్ త‌న త‌ప్పిదం కాద‌ని, ద‌ర్శ‌కుడు కొర‌టాల చేసిన స్పాట్ ఇంప్పువైజేష‌న్స్ వ‌ల్లే జ‌రిగింద‌ని ఇండైరెక్ట్ గా చిరంజీవి చెబుతున్న‌ట్టుగా ఆయ‌న మాట‌లు విన్నాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.