Begin typing your search above and press return to search.
'ఆచార్య' విషయంలో ఆ సెంటిమెంట్ పనిచేయదు: చిరంజీవి
By: Tupaki Desk | 24 April 2022 1:00 PM ISTచిరంజీవి - చరణ్ కథానాయకులుగా రూపొందిన 'ఆచార్య' ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ .. "చరణ్ ఒకే సమయంలో రాజమౌళి - కొరటాల శివ సినిమాలు చేసే పరిస్థితి వచ్చింది. రాజమౌళిగారితో ఒక సినిమా చేయడానికి ఒప్పు కున్న తరువాత ఆయన మెయిన్ గేట్ మూసేస్తారు. మరి కొరటాల సినిమా ఎలా చేయడం అని చరణ్ ఆలోచనలో పడ్డాడు.
అప్పుడు నేను కొరటాల శివ గారిని పిలిపించి, చరణ్ కి బదులుగా నాతో సినిమా చేసుకోమని చెప్పాను. అందుకు ఆయన ఆనందంగా అంగీకరించాడు. కథ రెడీ చేసుకోవడానికి వెళ్లాడు. కొన్ని నెలల తరువాత ఒక సమస్య వచ్చింది. అందులోని ఒక పాత్రకి చరణ్ అయితేనే బాగుంటాడనీ, తనకి చరణ్ కావాలని కొరటాల అడిగారు. అప్పుడు లేడీస్ సెంటిమెంట్ ను ఉయోగించి, ఇది సురేఖ గారి కోరిక అని రాజమౌళి గారికి చెప్పాను. అందుకు ఆయన అంగీకరించి అప్పుడప్పుడు చరణ్ ను వదులుతూ ఉండటం వలన 'ఆచార్య' పూర్తి చేశాము.
కొరటాల సినిమాలు ఎలా ఉంటాయో చూశాను .. ఆయన తీరును గమనించాను. ఆయన మార్కులో ఈ సినిమా ఉండటమే మంచిదనుకున్నాను. ఆయన మార్కు .. మా స్టైల్ కలిసిన ఈ సినిమా నిండుగా మెండుగా ఉంటుంది.
రామ్ లక్ష్మణ్ నన్ను ఒక పువ్వులా చూసుకుంటూనే, అద్భుతమైన ఫైట్స్ ను ఇచ్చారు. 'తిరు' కెమెరా పనితనం .. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. ఇక నిర్మాతగా నిరంజన్ రెడ్డిగారు ఎంతో మనసు పెట్టి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుని వెళ్లారు.
రాజమౌళి గారు వేసినటువంటి బాటలో ఇక అన్నీ ఇండియన్ సినిమాలుగా మారిపోతున్నాయి. ఏ డైరెక్టర్ ఏ సినిమా తీసినా అది ఇండియన్ సినిమా అయిపోతోంది. పుష్ప .. కేజీఎఫ్ 2 ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలైపోయాయి. ప్రభాస్ .. ఎన్టీఆర్ .. చరణ్ .. బన్నీ .. యశ్ అంతా పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. కంటెంట్ బాగుంటే చాలు .. ఇండియన్ సినిమా అయిపోతోంది. ఇక పూజ హెగ్డే నవ్వుకు మా ఆవిడ పెద్ద ఫ్యాన్. ఇక చరణ్ తన అనుభవాలు .. అనుభూతులు అన్నీ చెప్పేశాడు.
ఈ సినిమాలో చరణ్ ఎందుకు ఉండాలని కొరటాల పట్టు బట్టారు .. మా బలమైన కోరికను రాజమౌళిగారు ఎందుకు తీర్చారు? అనే ప్రశ్నలకు సినిమా చూసిన తరువాత సమాధానం దొరుకుతుంది. ఆ సినిమాలోని ఒక ఎమోషన్ ను రాబట్టాలంటే నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన మీ వల్లనే అవుతుందని శివ నమ్మారు. కచ్చితంగా చరణ్ తన వంతు మార్కులు వేసేసుకుని వెళ్లిపోతాడు .. తగ్గేదే లేదు. డాడీ సినిమాలో నేను కనపడితే చాలని చరణ్ అనుకున్నాడు. చరణ్ ఉన్న తరువాత నేను కనపడతానా లేదా అనే డౌటు నాకు వచ్చింది.
కచ్చితంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది. రాజమౌళి సినిమాలు చేసిన హీరోలకు ఆ తరువాత ఫ్లాపులు వస్తాయనే ఒక టాక్ ఉంది. అది వాస్తవం కాదు .. కంటెంట్ మిస్ ఫైర్ కావొచ్చు. నేను అలాంటివాటిని నమ్మను. 'ఆచార్య' విషయంలో ఆ సెంటిమెంట్ పనిచేయదు .. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత వస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఇది కచ్చితంగా జరుగుతుంది .. మీరు చూస్తారు. మనందరం కూడా దీనిని ఆస్వాదిద్దాం .. ఎంజాయ్ చేద్దాం" అని చెప్పుకొచ్చారు.