Begin typing your search above and press return to search.
చిరు గిఫ్ట్: టాప్ 3 రైటర్స్ కి జీవనసాఫల్యం
By: Tupaki Desk | 3 Nov 2019 5:22 PM ISTతెలుగు సినీ రచయితల సంఘం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఆదివారంనాడు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగాయి. ఈ వేదికపై మెగాస్టార్ చిరంజీవి సీనియర్ రచయితలైన ఆదివిష్ణు.. రావికొండలరావు.. సత్యానంద్.. భువనచంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు.
నేడు హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో.. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... సినీపరిశ్రమలో దర్శ నిర్మాతల తర్వాత అత్యధికంగా గౌరవించిచేది.. సన్నిహితంగా వుండేది రచయితలతోనే. పరుచూరి బ్రదర్స్.. సత్యానంద్ గారికి అది తెలిసిందే. అంతటి గౌరవాన్ని ఇస్తుంటాను. రచయితలే లేకపోతే మేం లేం అనేది వాస్తవం. మొన్నీమధ్య దీపావళికి మోహన్ బాబు ఇంటికి వెళ్ళాం. అందమైన వెండి సింహానం వుంది. అది చూడగానే.. సత్యానంద్‌ను రాఘవేంద్రరావు కూర్చో పెట్టారు. అది చూశాక.. కరెక్టే కదా.. ఆ స్థానం అలంకరించే అర్హుడు అనిపించింది. ఒక్క సత్యానంద్‌నే కాదు రచయితలందరూ గౌరవించేదిగా వుంటుంది. ఈ విషయమై సరదాగా మోహన్‌బాబుగారు ఓ మాట అన్నారు. రాఘవేంద్రరావును నిలబెట్టి సత్యానాంద్ ను కూర్చొపెట్టడం ఏమిటని.. అప్పుడు.. నేనన్నాను. రాఘవేంద్రరావు శిల్పి. అది చెక్కాలంటే తగిన రాయి కావాలి. అది కంటెంట్. ఆ కంటెంట్ సత్యానంద్.. అందుకే గౌరవించుకోవడం జరిగిందని.. సరదాగా మాట్లాడుకున్నాం. ఇదంతా రచయితలతో నాకున్న అనుబంధం. పరుచూరి బ్రదర్స్ తో అనుబంధం చాలా వుంది. కుటుంబ సభ్యుల్లా అయిపోయాం. `మగమహారాజు`కు రాసిన ఆకెళ్ళ ఇక్కడే వున్నారు. వీరందరికీ నా కృతజ్ఞతలు. ఈ సభకు నన్ను పిలవకపోయివుంటే అసంతృప్తిగా వుండేవాడిని. గొప్ప అనుభూతి పొందే అవకాశం ఇచ్చారు. ఎంతో అనుభవం వున్న ప్రతిభ వున్నవారికి నా చేతులమీదుగా సన్మానం చేయడం జీవితంలో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాం`` అన్నారు.
ఆత్రేయ-ఆరుద్ర- జంధ్యాల-ఆదివిష్ణు-రావి కొండలరావు-కోదండ రామిరెడ్డి-భువన చంద్ర .. తనతో పని చేసిన ఇంతమంది రచయితల్ని పేరు పేరునా గుర్తు చేసుకుని చిరు ప్రశంసల వర్షం కురిపించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే అంత మంది పేర్లను చిరు గుక్క తిప్పుకోకుండా ఈ వేదికపై చదివేయడం చూపరుల్లో ఆశ్చర్యం కలిగించింది.