Begin typing your search above and press return to search.

గాడ్ ఫాదర్‌ ఆ విషయం చివరి వరకు సస్పెన్స్‌

By:  Tupaki Desk   |   24 Aug 2021 6:31 AM GMT
గాడ్ ఫాదర్‌ ఆ విషయం చివరి వరకు సస్పెన్స్‌
X
మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్ ను మెగాస్టార్‌ చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్‌ చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా టైటిల్‌ ను రివీల్‌ చేయడంతో పాటు సినిమాకు సంబంధించిన పలు విషయాల పట్ల స్పష్టతను ఇవ్వడం జరిగింది. ఈ సినిమా కు దర్శకత్వం వహిస్తున్న మోహనరాజా ఈ సినిమా విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. తమిళంలో పలు సినిమాలను తెరకెక్కించిన ఆయన ఈ సినిమా తో టాలీవుడ్‌ లో సక్సెస్ ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక ఈ సినిమా గురించిన వార్తలు ఎన్నో వస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా రెండు పాత్రలకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అందులో ఒకటి చిరంజీవి సోదరిగా ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారు. ఆ పాత్ర చాలా కీలకం మరియు పవర్ ఫుల్‌ గా ఉంటుంది. ఆ పాత్రను నయనతారతో చేయించాలని భావిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు ఆ విషయంలో స్పష్టత రాలేదు. మరో వైపు బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ను ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేయిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో కూడా మేకర్స్ సస్పెన్స్ ను మెయింటెన్ చేస్తున్నారు.

దర్శకుడు మోహన్ రాజా ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్‌ గాడ్‌ ఫాదర్ లో ఉన్నాడా అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకుండా దాటవేశాడు. అన్ని విషయాలపై త్వరలో స్పష్టత వస్తుంది. కాని సినిమా మాత్రం తప్పకుండా అభిమానులతో పాటు అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేశాడు. ఆయన సల్మాన్‌ నటిస్తున్నాడా అనే ప్రశ్నకు లేదు అనే సమాధానం ఇవ్వలేదు కనుక ఖచ్చితంగా సల్మాన్ ఉన్నాడేమో అనే చాలా మంది నమ్మకంతో ఉన్నారు. కాని సల్మాన్ ఖాన్‌ విషయాన్ని మాత్రం మేకర్స్ ఇప్పట్లో స్పష్టత ఇవ్వకుండా విడుదల అయ్యే వరకు సస్పెన్స్ గానే ఉంచేలా ప్లాన్‌ చేస్తున్నారు.

గాడ్‌ ఫాదర్ సినిమా షూటింగ్‌ ను అక్టోబర్ లేదా నవంబర్‌ వరకు పూర్తి చేసేలా టార్గెట్‌ పెట్టుకున్నారట. అప్పటి వరకు పూర్తి చేసి భోళా శంకర్ సినిమా షూటింగ్ లో చిరంజీవి జాయిన్ అవుతాడని మెగా కాంపౌండ్‌ నుండి సమాచారం అందుతోంది. ఆచార్య విడుదలకు సిద్దంగా ఉండగా గాడ్‌ ఫాదర్‌ సినిమాను ఎప్పటికి విడుదల చేస్తారు అనే విషయం లో ప్రస్తుతానికి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కనుక గాడ్‌ ఫాదర్ విడుదల అయ్యేంత వరకు సల్మాన్ ఖాన్‌ విషయం సస్పెన్స్ అలాగే కొనసాగుతుందని అంటున్నారు. చిరంజీవి గతంలో మాదిరిగా ఈ విషయాన్ని మాటల్లో పడి లీక్ చేస్తే చెప్పలేం కాని.. విడుదల వరకు సస్పెన్స్ ను కంటిన్యూ చేయాలని మాత్రం భావిస్తున్నారట.

ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయిన గాడ్ ఫాదర్‌ సినిమాలో చిరంజీవి పాత్ర అత్యంత పవర్ ఫుల్‌ గా ఉంటుందని.. అభిమానులు చిరంజీవిని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలాగే చూపించబోతున్నారట. మలయాళ లూసీఫర్ కు చాలా మార్పులు చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఎంటర్‌ టైన్మెంట్‌ ను జోడించి చివరకు ఈ సినిమా స్క్రిప్ట్‌ రెడీ చేశారు. కనుక ఖచ్చితంగా చిరంజీవి గాడ్ ఫాదర్ మరో రేంజ్ బ్లాక్‌ బస్టర్ ను దక్కించుకుంటుంది అనే నమ్మకం తో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.