Begin typing your search above and press return to search.

విషాదంలో చిరంజీవి: రోడ్డు ప్రమాదంలో మిత్రుడి దుర్మరణం

By:  Tupaki Desk   |   27 Jun 2020 4:03 PM IST
విషాదంలో చిరంజీవి: రోడ్డు ప్రమాదంలో మిత్రుడి దుర్మరణం
X
మెగాస్టార్ చిరంజీవి విషాదంలో మునిగారు. అతడి స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరంజీవి బాల్య స్నేహితుడి కుటుంబం దుర్మరణం పాలైంది. చిరంజీవి, సత్యానందం స్నేహితులు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర్తిపాలేనికి చెందిన మైలాబత్తుల సత్యానందం, చిరంజీవి స్నేహితులు. నరసాపురం వైఎన్ కళాశాలలో డిగ్రీ కలిసి చదువుకున్నారు.

మైలాబత్తుల సత్యానందం, భార్య విజయకుమారి. వీరికి కుమారుడు జోసెఫ్‌, కుమార్తె ఉన్నారు. విజయకుమారి అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం సత్యానందం, జోసెఫ్‌తో కలిసి కారులో శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో సూర్యాపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

వారి మృతితో చిరంజీవి కలత చెందారు. సత్యానందం, చిరంజీవి ఎంతో స్నేహంగా మెలిగేవారు. చిన్ననాటి స్నేహితులు. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఉంది. చిరంజీవి సినిమాల్లోకి రాగా స‌త్యానందం రాజ‌మండ్రి డిగ్రీ క‌ళాళాల‌లో అధ్యాప‌కుడిగా స్థిరపడ్డారు. రాజమండ్రి డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.