Begin typing your search above and press return to search.

చిరు చెప్పిన ఫస్ట్ నైట్ రహస్యం

By:  Tupaki Desk   |   7 Jan 2016 5:17 PM GMT
చిరు చెప్పిన ఫస్ట్ నైట్ రహస్యం
X
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతిలకు ఓ శోభనం సీన్ ఉంటుంది. ట్రైన్ లోనే శోభనం చేసేసుకున్నానని అత్త వాణిశ్రీకి చెబుతాడు. అలాంటి సందర్భం ఒఖటి చిరు రియల్ లైఫ్ లో కూడా ఎదురైందట.

సురేఖతో పెళ్లైన కొత్తలో ఓసారి షూటింగ్ కోసం భార్యతో కలిసి మద్రాస్ వెళ్తున్నారట చిరు. చిరంజీవి ట్రైన్ షెడ్యూల్ తెలుసుకున్న దర్శకుడు రాఘవేంద్రరావు.. చిరు దంపతులు ప్రయాణిస్తున్న కూపేని ఫస్ట్ నైట్ తలపించేలా డెకరేట్ చేయించారట. పళ్లు, పూలు, స్వీట్లు.. ఇలా సకలం ఏర్పాటు చేయించారట. ఇలాంటి ఫస్ట్ నైట్ తానెప్పుడూ చేసుకోలేదంటూ.. తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసేకున్నారు మెగాస్టార్.

అల్లు రామలింగయ్య జాతీయ పురస్కార ప్రదానోత్సవం సందర్భంగా.. రాఘవేంద్రరావుకు సన్మానం చేస్తూ... చిరంజీవి ఈ విషయాలను స్వయంగా వెల్లడించారు. ముప్ఫై ఏళ్లకు పూర్వం సంగతులను చిరు పూసగుచ్చినట్లు వివరిస్తుంటే.. రాఘవేంద్రరావు ముసిముసిగా నవ్వుతున్నారు. ఏమైనా మెగాస్టార్ బాగా రొమాంటిక్. లేకపోతే.. రీసెంట్ గా షష్టి పూర్తి చేసుకున్న ఆయన.. తన ఫస్ట్ నైట్ సంగతులను ఎలా గుర్తు చేసుకోగలరు చెప్పండి. అది కూడా ట్రైన్ లో తొలిరాత్రి చేసుకున్నానని చెప్పడమంటే దానికి చాలా గట్స్ కావాలి కదా. అయినా.. ఇలాంటి డేరింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో చిరు తర్వాతే ఎవరైనా.