Begin typing your search above and press return to search.

ఉపాసన.. చిరు ఫిల్టర్ కాఫీ

By:  Tupaki Desk   |   2 Dec 2017 11:30 AM IST
ఉపాసన.. చిరు ఫిల్టర్ కాఫీ
X
మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగానే కాకుండా అభిమానులకు వ్యక్తగతంగాను తన అభిరుచులతో ఎంతో దగ్గరయ్యారు. ఇది అందరికి తెలిసిన విషయమే. చిరంజీవి ఏ స్టైల్ ఫాలో అయినా మెగా అభిమానులు తప్పకుండా ఫాలో అవుతారు. ఇకపోతే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి 70MM దోశ ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి వేసిన ఆ దోశలో ఆయిల్ లేకుండా ఉండడమే స్పెషల్.

చాలా మంది హీరోలకు మెగాస్టార్ ఆ రుచిని చూపించారు. మెల్ల మెల్లగా దోశకు పబ్లిసిటి బాగా పెరిగిపోయింది. అంతే కాకుండా కొన్ని హోటల్స్ మెన్యు లో కూడా చిరు దోశ కనిపించేది. కానీ ఈ మధ్య కాలంలో ఆ నేమ్ కనిపించడం లేదు. చిరు 60వ బర్త్ డే సందర్బంగా అప్పట్లో చరణ్ ఆ దొశను 'చిరు దోశ' పేరిట పేటెంట్ చేయించాడు. అయితే ఇప్పుడు మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన మామయ్య మెగాస్టార్ పేరు మీద ఫిల్టర్ కాఫీని తీసుకొచ్చింది.

అపోలో ఫౌండేషన్ తరపున జూబ్లీహిల్స్ లో థియేటర్ కేఫ్ ని ఉపాసన స్టార్ట్ చేశారు. ఇందులో చిరు ఫిల్టర్ కాఫీ చాలా స్పెషల్. అది కేవలం 20 రూపాయలేనట. మెగాస్టార్ కాఫీని కూడా చాలా బాగా చేస్తారు. దీంతో ఆయన పేరు మీద కోడలు ఇలా కేఫ్ లో కాఫీ ఏర్పాటు చేయడం చాలా స్పెషల్ అంటున్నారు అభిమానులు. ఇక కేఫ్ లో వరల్డ్ ఫేమస్ సమోసా, మిర్చి బజ్జీలు, హైదరాబాదీ కేసర్ రోజ్ టీ, లుక్మి చికెన్/వెజ్ కూడా స్పెషల్.