Begin typing your search above and press return to search.

మరో మెగా ఠాగూర్‌ ఖైదీ రాబోతున్నాడా..!

By:  Tupaki Desk   |   18 Jun 2022 10:39 AM GMT
మరో మెగా ఠాగూర్‌ ఖైదీ రాబోతున్నాడా..!
X
మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా నిరాశ పర్చినా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా.. ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేస్తున్న సినిమాల సంఖ్య పెద్దగా ఉంది. లూసీఫర్ రీమేక్ గాడ్‌ ఫాదర్‌ ను మోహన్‌ రాజా దర్శకత్వంలో చేస్తున్నాడు. వేదాళం రీమేక్‌ ను భోళాశంకర్ పేరుతో మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు.

ఆ రెండు సినిమాలు మాత్రమే కాకుండా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమాను చేస్తున్నాడు. ఈ మూడు షూటింగ్‌ దశలో ఉన్నాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చర్చల దశలో ఉంది. ఇన్ని సినిమాలు ఉండగానే వి వి వినాయక్ తో ఒక సినిమాను చేసేందుకు చిరంజీవి ఓకే చెప్పాడు అంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

గతంలో వీరిద్దరి కాంబోలో ఠాగూర్ మరియు ఖైదీ నెం.150 సినిమాలు వచ్చాయి. చిరంజీవి మరియు వినాయక్ మద్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరు రీ ఎంట్రీ మూవీని ఆయనతో చేశాడు అంటే ఎంతటి నమ్మకం వినాయక్ పై ఉంచాడో అర్థం చేసుకోవచ్చు. వినాయక్ పై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. వినాయక్‌ భారీ విజయాన్ని ఖైదీ నెం.150 తో దక్కించుకున్నాడు.

ప్రస్తుతం బెల్లంకొండ బాబుతో చత్రపతి ని హిందీలో తీస్తున్నాడు. షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాది చివర్లోనే సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వచ్చే ఏడాదిలో చిరంజీవి తో సినిమా కోసం స్క్రిప్ట్‌ వర్క్ ను త్వరలోనే మొదలు పెట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చిరంజీవి తో వినాయక్ తీసిన సినిమాలు రెండు కూడా రీమేక్‌ లే.. కనుక ఈసారి ఏం సినిమా చేస్తాడు అనేది చూడాలి.

ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు కమర్షియల్‌ గా విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక తప్పకుండా వీరి కాంబోలో మూడవ సినిమా కూడా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. వినాయక్‌ తో చిరు మూవీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అంటూ మెగా ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్నారు. వారి ఎదురు చూపులకు వచ్చే ఏడాది తెర పడే అవకాశం ఉందట.