Begin typing your search above and press return to search.

కూతురు చేతిలో పెట్టేసిన చిరంజీవి

By:  Tupaki Desk   |   26 Jun 2016 4:21 AM GMT
కూతురు చేతిలో పెట్టేసిన చిరంజీవి
X
నిజానికి మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న ప్రతిష్ఠాత్మక సినిమా అనేకంటే.. నెంబర్‌ పరంగా చూసుకుంటే ఇది ఐకానిక్ మూవీ.. అలాగే రీ-ఎంట్రీ పరంగా చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్‌ సినిమా. అందుకే మెగా150 అంటే అందరికీ అంత ఉత్సాహం. అయితే ఈ ఉత్సాహంలో చిరంజీవి కూడా తన కుటుంబ సభ్యులను బాగానే కలిపేస్తున్నారు.

ఇప్పటికే కొడుకు రామ్‌ చరణ్‌ ఈ సినిమాతో కొణిదెల ప్రొడక్షన్స్ అంటూ ఒక ప్రొడక్షన్‌ కంపెనీ పెడుతున్నాడు. ఇక ప్రొడక్షన్‌ యవ్వారాలన్నీ దగ్గరుండి భావ మరిది అల్లూ అరవింద్‌ ఎలాగో చూసుకుంటారు. తక్కిన మెగా హీరోలందరూ అప్పుడప్పుడూ సెట్‌ కి వెళ్లి.. మళ్లీ చిరు పెర్ఫామెన్స్ ను లైవ్‌ లో చూసి ఆనందించేస్తున్నారు. వీరందరూ ఒకెత్తయితే.. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ ప్రాజెక్టు కోసం ఒక క్రూ మెంబర్ లా మారిపోయారు. ఎందుకంటే కాస్ట్యూమ్స్ సంగతి ఇప్పుడు ఆమె చేతిలో పెట్టేశారు చిరంజీవి. గతంలో జై చిరంజీవ.. శంకర్ దాదా జిందాబాద్‌ సినిమాలకు స్టయిలింగ్‌ చేసిన సుస్మిత.. ఇప్పుడు మెగా150 కోసం మరోసారి తన స్టయిలింగ్‌ టాలెంట్‌ ఏంటో చూపించాలని ఫిక్సయ్యింది.

మొన్న మనకు చిరంజీవి అలా టీ షర్టు.. మరీ బ్రైట్‌ షేడ్స్ లేకుండా ఉండేటి బట్టల్లో మెరుస్తూ కనిపించారే.. అదంతా సుస్మిత టాలెంటే. చూస్తుంటే 150వ సినిమా కోసం ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక్కటైనట్లు ఉంది కదూ. దటీజ్‌ మెగా ఫ్యామిలీ అనాల్సిందే మరి!!